ఔను వారిద్దరూ లేచిపోయారు.. భర్త వింత ఫిర్యాదుతో కళ్ళు తేలేసిన ఖాకీలు..! ఇదో పెద్ద కథే..
ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్నాడు.. రెండేళ్లయింది.. భార్య.. భర్త ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది.. ఆమె ఏడు నెలల గర్భిణి.. ఈ క్రమంలోనే ఇంట్లోనుంచి వెళ్లిపోయింది.. దీంతో గర్భిణి భార్య తప్పిపోయిందని ఓ భర్త కేసు పెట్టాడు.. అంతేకాకుండా.. ఆమె ‘లెస్బియన్’ ప్రియురాలితో కలిసి పారిపోయిందని, ఆమె జాడను గుర్తించాలని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది..
ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్నాడు.. భార్య గతం గురించి భర్తకు ఏం తెలియదు.. వివాహమై రెండేళ్లయింది.. భార్య.. భర్త ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది.. ఆమె ఏడు నెలల గర్భవతి కూడా.. ఈ క్రమంలోనే భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది.. ఒకరోజును చెప్పాపెట్టకుండా ఇంట్లోనుంచి వెళ్లిపోయింది.. దీంతో గర్భిణి భార్య తప్పిపోయిందని ఓ భర్త కేసు పెట్టాడు.. అంతేకాకుండా.. ఆమె ‘లెస్బియన్’ ప్రియురాలితో కలిసి పారిపోయిందని, ఆమె జాడను గుర్తించాలని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.. ఈ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.
తన ఏడు నెలల గర్భిణి భార్య తప్పిపోయిందని, ఆమె లెస్బియన్ భాగస్వామితో కలిసి పారిపోయిందని ఆరోపిస్తూ భర్త గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అక్టోబరులో తన ఇంటినుంచి వెళ్లిన భార్య తిరిగి రాలేదని భర్త తెలిపాడు. ఆమె కనిపించకుండా పోవడంతో చంద్‌ఖేడా పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అయితే ఆమె ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జంట 2022 లో వివాహం చేసుకున్నారు.. భర్తకు ఎలాంటి వైవాహిక సమస్యలు లేవు.. ఈ క్రమంలో భార్య గర్భవతి అయ్యిందని తెలిపారు. అయితే.. పెళ్లికి ముందే.. ఆమెకు (భార్యకు) లెస్బియన్ ప్రియురాలితో బంధం ఏర్పడింది.. ఆ మహిళలిద్దరూ స్వలింగ సంపర్కులని తెలింది.. దీంతో ఒక మహిళ కుటుంబసభ్యులు సంబంధం చూసి వివాహం జరిపించారు.. ఏడు నెలల గర్భవతి.. కాగా.. అక్టోబర్ లో మళ్లీ లెస్బియన్ ప్రియురాలు కలవడంతో ఆమెతో కలిసి పారిపోయిందని.. పోలీసులు తెలిపారు.. పెళ్లికి ముందే ఆమె రిలేషన్‌లో ఉండేదని.. ఆ సంగతి ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసని తెలిపారు.
అయితే.. భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఆచూకీ కనిపెట్టకపోవడంతో విస్తుపోయిన అతను.. కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు.. దీనిపై విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు డిసెంబరు 24లోగా ఆమెను కోర్టు ఎదుట ప్రవేశ పెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..