AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Steroids: బాడీ షేప్ కోసం స్టెరాయిడ్స్ వాడిన జిమ్ ట్రైనర్.. చివరకు రక్తపు వాంతులతో

Chennai Gym Trainer Death: ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ అతడు కోలుకోలేదు. 2 కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆకాష్ శరీరం వైద్యానికి రెస్పాండ్ అవ్వలేదు. చివరకు అతడు తుదిశ్వాస విడిచాడు.

Steroids: బాడీ షేప్ కోసం స్టెరాయిడ్స్ వాడిన జిమ్ ట్రైనర్.. చివరకు రక్తపు వాంతులతో
Gym Trainer Died
Ram Naramaneni
|

Updated on: Apr 02, 2023 | 3:32 PM

Share

చెన్నైలో  స్టెరాయిడ్స్ వినియోగించడం వల్ల జిమ్ ట్రైనర్ మృతి చెందాడు. చెన్నై ఆవడి సమీపంలోని నెమిలిచ్చేరిలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసం ఉండే  25 ఏళ్ల ఆకాష్ జిమ్ టైనర్‌గా పని చేస్తున్నారు. బాడీ షేప్ కోసం స్టెరాయిడ్స్ విపరీతంగా వాడాడు. దీంతో రెండు రోజుల క్రితం అతడికి రక్తపు వాంతులు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, రెండు కిడ్నీలు పూర్తిగా పాడయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలోనే చికిత్స పోందుతూ మృతి చెందాడు.  ఆకాష్ రాష్ట్ర స్థాయి పోటీలో గెలవడానికి కఠోర శిక్షణ తీసుకున్నాడు. తన స్టామినా మరింత పెంచుకునే  ప్రయత్నంలో, పిచ్చితనంతో పెద్ద మొత్తంలో స్టెరాయిడ్లను తనకు తానుగా ఇంజెక్ట్ చేసుకున్నాడు. దీంతో విపరీత పరిణామాలు ఎదురై ప్రాణాలు విడిచాడు.

ఇటు హైదారాబాద్‌లో కూడా స్టెరాయిడ్స్ కలకలం

మహానగరంలో మత్తుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత నిఘా పెట్టినా సరే ఎక్కడో అక్కడ డ్రగ్‌ మాఫియా ఉనికి హడలెత్తిస్తోంది. మరోవైపు లేటెస్ట్‌గా మరో బేషరమ్‌ వ్యవహారం సంచలనం రేపింది. అదే కండల క్రేజ్‌లో స్టెరాయిడ్స్‌ దందా. జిమ్స్‌ టార్గెట్‌గా సాగుతోన్న స్టెరాయిడ్స్‌ రాకెట్‌కు చెక్‌ పెట్టారు రాచకొండ SOT పోలీసులు. నగరంలో స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..