AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్ గ్రేట్.. నదిలోకి దూకి ముగ్గురి ప్రాణాలు కాపాడిన పదేళ్ల బాలుడు

పిల్లలు, పెద్దలు సరదాగా ఈతకోసమని కాలువలు, చెరువులకి వెళ్తుంటారు. కొన్నిసార్లు ఈత రాని వాళ్లు లోతులోకి వెళ్లిపోవడంతో మునిగిపోయి గల్లంతైన ఘటనలు కూడా చాలానే జరిగాయి. ఇప్పడు తాజాగా ఓ పదేళ్ల బాలుడు మనిగిపోతున్న తన స్నేహితులను కాపాడి అందిరి చేత ప్రశంసలు పొందుతున్నాడు.

వావ్ గ్రేట్.. నదిలోకి దూకి ముగ్గురి ప్రాణాలు కాపాడిన పదేళ్ల బాలుడు
Goa Cm
Aravind B
|

Updated on: Apr 02, 2023 | 3:44 PM

Share

పిల్లలు, పెద్దలు సరదాగా ఈతకోసమని కాలువలు, చెరువులకి వెళ్తుంటారు. కొన్నిసార్లు ఈత రాని వాళ్లు లోతులోకి వెళ్లిపోవడంతో మునిగిపోయి గల్లంతైన ఘటనలు కూడా చాలానే జరిగాయి. ఇప్పడు తాజాగా ఓ పదేళ్ల బాలుడు మనిగిపోతున్న తన స్నేహితులను కాపాడి అందిరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గోవా రాజధాని పణాజీ నుంచి 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న కుంబార్జువాడలో గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఉత్సవాల సందర్భంగా నలుగురు స్నేహితులు అక్కడికి వెళ్లారు. రంగులు చల్లుకొని కాసేపు అక్కడ ఆనందంగా ఆడుకున్నారు. మొత్తం రంగులతో తడిసిపోయిన ఆ పిల్లలు శుభ్రం చేసుకునేందుకని దగ్గర్లో ఉన్న ఓ నది వద్దకు వెళ్లారు.

వారిలో ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు జారీ నీటిలో పడిపోయారు. అసలే వారికి ఈత కూడా రాకపోవడంతో ప్రాణభయంతో కేకలు వేశారు. స్నేహితులను గమనించిన సంజయ్ అనే పదేళ్ల బాలుడు వెంటనే నీటిలోకి దూకాడు. ఒకరి తర్వాత మరొకరిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. అక్కడున్న స్థానికుల సమాచారంతో అంబులెన్సుకు ఫోన్ చేశాడు. చివరికి సీపీఆర్ చేయడంతో ఆ ముగ్గురు తేరుకున్నారు. మిత్రులు మునిగిపోతుంటే ధైర్యంగా నీటిలో దూకి ప్రాణాలు కాపాడిన బాలుడు సంజయ్ ను అందరూ అభినందించారు. సంజయ్ పేరు గోవా అంతటా వ్యాపించింది. శుక్రవారం రోజున ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఆ బాలుడ్ని పిలిపించి రూ. లక్ష నగదు అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు!
విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు!
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్