Digital Arrest: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో మహిళా డాక్టర్.. ఏం జరిగిందో తెలిస్తే షాకే.. .
సైబన్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టులతో ప్రజలను భయపెడుతూ కోట్లు దోచుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ బాధితులుగా మిగిలారు. గుజరాత్‌లో ఓ మహిళా డాక్టర్ సైబర్ ఉచ్చులో చిక్కుకుంది. ఏకంగా 3నెలల పాటు డాక్టర్‌ను టార్చర్ పెట్టారు నిందితులు.. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. నష్టాలు అన్నే ఉన్నాయి. గత కొంత కాలంగా స్కామ్‌లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజలను భయపెట్టి వందల కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. గత కొంతకాలంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ సైబర్ మోసానికి గురయ్యారు. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలలుగా సైబర్ నేరస్థులు ఆమెను డిజిటల్ అరెస్టులో ఉంచి.. ఏకంగా రూ.19 కోట్ల రూపాయలను కాజేశారు. ఇదంతా ఎలా జరిగింది..? మోసగాళ్ళు వైద్యురాలిని ఎలా ట్రాప్ చేశారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
స్కామ్ ఎలా జరిగింది..?
మార్చి 15న సైబర్ నేరగాళ్లు మహిళా డాక్టర్‌కు ఫోన్ చేసి అతడి ఫోన్‌లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని భయపెట్టారు. తమకు సహకరించకపోతే, ఫోన్ కనెక్షన్ డిస్‌కనెక్ట్ చేయడంతో పాటు మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తాని బెదిరించారు. ఎస్ఐ, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సహా ఎంతో మంది పేర్లతో కాల్స్ చేస్తూ డాక్టర్‌ను ట్రాప్ చేశారు. చివరకు వారి ఒత్తిడి తట్టుకోలేక ఆమె ఏకంగా రూ.19కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసింది. అంతటితో వేధింపులు ఆగకపోవడంతో బంగరం తాకట్టు పెట్టి మరీ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఏం పని చేసిన, ఎక్కడికెళ్లినా తమకు చెప్పాలంటూ భయపెట్టేవారు. అయితే సడెన్‌గా కాల్స్ ఆగిపోవడంతో ఆమెకు డౌట్ వచ్చి జరిగిన విషయం బంధువులకు చెప్పింది. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డిజిటల్ అరెస్ట్‌లో ఇదొక విధానమని పోలీసులు అనుమానిస్తున్నారు. సూరత్‌లో ఓ నెరస్థుడిని అరెస్ట్ చేశారు. అతడి ఖాతాలో రూ.కోటి రూపాయలు ఉన్నట్లు పోలీసలు గుర్తించారు. అతడిని విచారించిన పోలీసులు.. ముఠాలోని మిగితా సభ్యుల కోసం గాలిస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే..?
ఇది చాలా ప్రమాదకరమైన సైబర్ మోసం. దుండగులు సీబీఐ, పోలీస్, సైబర్ సెల్ లేదా ఈడీ అధికారులంటూ బెదిరించి మోసం చేస్తారు. బాధితుడు ఎటు కదలకుండా ఎవరికీ ఫిర్యాదు చేయకుండా భయపెడతారు. ఇప్పటికే చాలా మంది కోట్లు పోగొట్టుకున్నారు. పోలీసులు మాత్రం అధికారులు ఎవరూ వీడియో కాల్స్ చేయరని.. వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు అని చెబుతున్నారు. ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




