AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marks Sheet: ఇదేందయ్యా ఇదీ.. 200లకుగానూ 212 మార్కులు వేసిన టీచరమ్మ! పేరెంట్స్‌ పరేషాన్‌..

ఎంత బాగా చదివినా నూటికి 90 మార్కులు రావడం గగనం. మరీ పరీక్ష ఇరగదీస్తే నూటికి నూరు మార్కులు వస్తాయి. కానీ ఈ విద్యార్ధిని మాత్రం బాగా చదివి పరీక్షలు రాసినట్టుంది. టీచర్‌ చేతికి ఎముక లేకుండా మార్కులు వేసింది. రెండు సబ్జెక్టులకు 200 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తే ఏకంగా 212, 211 మార్కులు వేసేసింది. దీంతో సదరు విద్యార్ధి మార్కుల షీట్‌ చూసి ఆ విద్యార్ధితోపాటు తల్లిదండ్రులు కూడా గుడ్లు తేలేశారు. ఖంగుతిన్న విద్యాశాఖ అధికారులు..

Marks Sheet: ఇదేందయ్యా ఇదీ.. 200లకుగానూ 212 మార్కులు వేసిన టీచరమ్మ! పేరెంట్స్‌ పరేషాన్‌..
Student Gets 212 Out Of 200 Marks
Srilakshmi C
|

Updated on: May 06, 2024 | 8:58 PM

Share

అహ్మదాబాద్‌, మే 6: ఎంత బాగా చదివినా నూటికి 90 మార్కులు రావడం గగనం. మరీ పరీక్ష ఇరగదీస్తే నూటికి నూరు మార్కులు వస్తాయి. కానీ ఈ విద్యార్ధిని మాత్రం బాగా చదివి పరీక్షలు రాసినట్టుంది. టీచర్‌ చేతికి ఎముక లేకుండా మార్కులు వేసింది. రెండు సబ్జెక్టులకు 200 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తే ఏకంగా 212, 211 మార్కులు వేసేసింది. దీంతో సదరు విద్యార్ధి మార్కుల షీట్‌ చూసి ఆ విద్యార్ధితోపాటు తల్లిదండ్రులు కూడా గుడ్లు తేలేశారు. ఖంగుతిన్న విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విచిత్ర ఘటన గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

గుజరాత్‌లోని దాహోద్ జిల్లా ఝలోద్ తాలూకా ఖరసనా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాల్గవ తరగతి విద్యార్థిని వంశీబెన్ మనీష్‌భాయ్‌ ఇటీవల పరీక్షలు రాసింది. బాలిక పరీక్షల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. రెండు సబ్జెక్టులలో 200 మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. గుజరాతీ ల్యాంగ్వేజ్‌ పరీక్షలో 200కుగాను 211, గణితం సబ్జెక్టులో 200కుగాను 212 మార్కులు స్కోర్‌ చేసినట్లు మార్కుల షీట్‌ వెల్లడించింది. అన్ని సబ్జెక్టులకు కలిపి వెయ్యి మార్కులకు గానూ 934 మార్కులు వంశీబెన్‌కు వచ్చాయి.

పరీక్షల్లో తనకు వచ్చిన ఈ మార్కులకు సంబంధించిన ప్రోగ్రెస్‌ కార్డును విద్యార్థిని వంశీబెన్ తన తల్లిదండ్రులకు చూపించింది. ఈ మార్కులు చూసి వారు పరేషాన్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ మార్కుల షీట్‌ సోషల్‌ మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన విద్యాశాఖ తప్పిదానికి గల కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.