అయ్యో పాపం.. బెయిల్ వచ్చినా 3 ఏళ్లు జైల్లోనే ఉన్నాడు.. ఎందుకంటే
గుజరాత్‌లోని చందన్ ఠాకుర్ (27) అనే వ్యక్తిని ఓ హత్య కేసులో జైలుకి తరలించారు. దీనివల్ల అతను ప్రస్తుతం జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అయితే 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 29న.. అతడి శిక్షను గుజరాత్ హైకోర్టు నిలిపివేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి హైకోర్టు రిజస్ట్రీ.. అక్కడి జైలు అధికారులకు ఆర్డరు కాపీని కూడా ఈ-మెయిల్ ద్వారా పంపించింది.

సాధారణంగా ఎవరైన నేరం చేస్తే వాళ్లు జైలు శిక్షను అనుభవిస్తారు. ఒకవేళ వాళ్లకి బెయిల్ వచ్చినట్లైతే వెంటనే విడుదలైపోతారు. కానీ ఓ కేసులో శిక్షను అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ వచ్చినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల అతడు మూడేళ్ల వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చినప్పటికీ.. ఇందుకు సంబంధించినటువంటి ఈ-మెయిల్‌లో వచ్చిన ఆర్డరు కాపీని అధికారులు తెరవకపోవడంతో.. ఆ నిందితుడు మూడు సంవత్సరాలు జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆ న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. ఆ నిందితుడికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని చందన్ ఠాకుర్ (27) అనే వ్యక్తిని ఓ హత్య కేసులో జైలుకి తరలించారు. దీనివల్ల అతను ప్రస్తుతం జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అయితే 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 29న.. అతడి శిక్షను గుజరాత్ హైకోర్టు నిలిపివేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి హైకోర్టు రిజస్ట్రీ.. అక్కడి జైలు అధికారులకు ఆర్డరు కాపీని కూడా ఈ-మెయిల్ ద్వారా పంపించింది. కానీ జైలు అధికారులు మాత్రం మెయిల్‌లో ఉన్నటువంటి అటాచ్‌మెంట్‌ను ఏకంగా మూడు సంవత్సర వరకు తెరచి చూడలేదు. దీనివల్ల ఆ నిందితుడు 2023 వరకు జైల్లోనే తన జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా అతడు మళ్లీ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల అధికారులు చేసిన నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. దీంతో గుజరాత్ హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.
బెయిల్ ఆర్డరు కాపీలను కోర్టు రిజస్ట్రీ నుంచి జైలు అధికారులకి చేరినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి అటాచ్‌మెంట్‌ను మాత్రం తెరిచి చూడలేకపోయారు. అంతేకాదు.. ఆ ఈ-మెయిల్‌ను జిల్లా సెషన్స్ కోర్టుకు కూడా పంపించారు. కానీ అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే. అధికారులు సరైన పర్యవేక్షణ చేయలేకపోయారు. వాస్తవానికి ఆ దరఖాస్తుదారునికి బెయిల్ వచ్చిన కూడా అతడు ఆ స్వేచ్ఛను ఆస్వాదించలేకపోయాడు అని గుజరాత్ హైకోర్టు ధర్మాసనం తెలిపింది. అంతేకాదు.. కరోనా సమయంలో కూడా ఇలా ఈ మెయిల్స్‌లో వచ్చినటువంటి ఆదేశాలు అమలయ్యాయా లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీంతో గుజరాత్ హైకోర్టు.. ఇందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేయాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీకి సూచనలు చేసింది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఈ కేసు విషయంలో అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..