AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Elections 2022: గుజరాత్‌లో ప్రారంభమైన తొలి విడత పోలింగ్.. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పలువురు ప్రముఖులు..

గుజరాత్ లో తొలి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 182 శాసనసభ స్థానాలున్న గుజరాత్ లో డిసెంబర్ 1వ తేదీ గురువారం 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగుతోంది. మిగిలిన 93 స్థానాలకు డిసెంబరు 5వ తేదీన పోలింగ్‌..

Gujarat Assembly Elections 2022: గుజరాత్‌లో ప్రారంభమైన తొలి విడత పోలింగ్.. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పలువురు ప్రముఖులు..
Gujarat Elections
Amarnadh Daneti
|

Updated on: Dec 01, 2022 | 8:15 AM

Share

గుజరాత్ లో తొలి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 182 శాసనసభ స్థానాలున్న గుజరాత్ లో డిసెంబర్ 1వ తేదీ గురువారం 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగుతోంది. మిగిలిన 93 స్థానాలకు డిసెంబరు 5వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల వరకు బీజేపీ- కాంగ్రెస్ మధ్య ఉన్న ద్విముఖ పోటీ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో త్రిముఖ పోరుగా మారింది. తొలి విడతలో దక్షిణ గుజరాత్‌, కచ్‌ సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల పరిధిలో 89 శాసనసభ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. బిజెపి, కాంగ్రెస్‌ 89 స్థానాల్లో పోటీ పడుతుండగా, ఆమాద్మీ పార్టీ 88 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ 57 స్థానాల్లోనూ, భారతీయ ట్రైబల్‌ పార్టీ (బిటిపి) 14 స్థానాల్లోనూ, సమాజ్‌ వాదీ పార్టీ 12 చోట్ల, సిపిఎం నాలుగు స్థానాల్లోనూ, సిపిఐ రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తున్నారు. వీరితో పాటు 339 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలివిడతలో ఎన్నికలు జరగుతున్న 89 నియోజకవర్గాలకు గానూ మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 718 మంది పురుషులు కాగా, 70 మంది మహిళలు ఉన్నారు.

తొలి దశలో ఇసుదన్‌ గద్వీ, పరుషోత్తం సోలంకి, కుంవర్జీ భవలియా, కాంతిలాల్‌ అమ్రుతియా, వివబ జడేజా, గోపాల్‌ ఇటాలియా వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇసుదన్‌ గద్వీ ఆమాద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాగా.. బీజేపీకి చెందిన కునవర్జీయా ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యే. కాంతిలాల్‌ అమ్రుతియా ఇటీవల జరిగిన మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనలో సహయక చర్యల్లో పాల్గొని మంచి పేరు పొందారు. ఇక రిబ జడేజా ప్రసిద్ధ భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య కాగా.. వీరితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌ అధ్యక్షులు గోపాల్‌ ఇటాలియా తొలి విడత బరిలోనే పోటీపడుతున్నారు.

గుజరాత్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 4కోట్ల 91 లక్షల 35 వేల 400 కాగా.. తొలి విడతలో 2 కోట్ల 39 లక్షల 76 వేల 670 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో కోటి 24లక్షల 33వేల 362 మంది పురుష ఓటర్లు కాగా.. కోటి 15 లక్షల 42 వేల 811 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 497 మంది టాన్స్ జెండర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడతలో 25 వేల 434 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పట్ణణాల్లో 9వేల18, గ్రామీణ ప్రాంతాల్లో 16వేల 416 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పటు చేశారు. తొలి విడతలో మొత్తం 34వేల324 బ్యాలెట్‌ యూనిట్లను మరో 34వేల 324 కంట్రోలు యూనిట్లను, 38వేల749 వివిప్యాట్లను వినియోగిస్తున్నారు. ఉత్కంఠ రేపుతున్న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8వ తేదీన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..