AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drug Free State: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. ఏకంగా రూ.2,212 కోట్ల మత్తుపదార్థాల ధ్వంసం!

గుజరాత్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో రూ.2,212 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటిని పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేశారు.

Drug Free State: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. ఏకంగా రూ.2,212 కోట్ల మత్తుపదార్థాల ధ్వంసం!
Gujarat Drug Crackdown
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 10:16 AM

Share

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా గుజరాత్ ను మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సుమారు 2,212 కోట్ల భారీ విలువైన మత్తుపదార్థాలను అధికారులు పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో పూర్తిగా నాశనం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి సమక్షంలో మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ పదార్థాలు పట్టుబడ్డాయి. మొత్తం 14,500 కిలోల మత్తుపదార్థాలలో 11.1 లక్షల మద్యం సీసాలు ఉన్నాయి.. ఈ దాడులు స్వాధీనాలకు సంబంధించి మొత్తం 877 కేసులు నమోదు చేశారు.

శాస్త్రీయ పద్ధతిలో మత్తుపదార్థాల ధ్వంసం

భరూచ్ జిల్లాలోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న భరూచ్ ఎన్విరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ BEILలో అత్యాధునిక డిస్ట్రాయర్ యంత్రంలో ఈ భారీ మొత్తంలోని డ్రగ్స్‌ను నిర్వీర్యం చేశారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనల ప్రకారం పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న గుజరాత్ ప్రభుత్వం

గుజరాత్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. అయినప్పటికీ చాప కింద నీరులా సముద్ర మార్గాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి గుజరాత్ లోకి వస్తున్న డ్రగ్స్,మద్యం పై ఉక్కుపాదం మోపుతోంది గుజరాత్ క్రభుత్వం. డ్రగ్ కార్టెల్స్, సిండికేట్లు , పెడ్లర్ల భరతం పట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, యువతను మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు పలు సామాజిక సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?