AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లైట్‌లో ఆస్తమా ఎటాక్‌కు గురై ప్రయాణికుడు మృతి.. జర్నీలో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్‌ వస్తే ఏం చేయాలి!

కౌలాలంపూర్ నుండి సిడ్నీ వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. విమానం మార్గమధ్యలో ఉండగా ఓ ప్రయాణికులు ఆస్తమా ఎటాక్ గురై ప్రాణాలు కోల్పోయాడు. విమాన సిబ్బంది అడికి ప్రథమ చికిత్స అందించినప్పటికీ ఎలాంటి లాభం లేకపోయింది. ఆస్తమా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆ ప్రయాణికుడు అక్కడే తుది శ్వాస విడిచారు.

ఫ్లైట్‌లో ఆస్తమా ఎటాక్‌కు గురై ప్రయాణికుడు మృతి.. జర్నీలో ఉన్నప్పుడు ఈ  ప్రాబ్లమ్‌ వస్తే ఏం చేయాలి!
58 Year Old Indian Man Dies After Mid Air
Anand T
|

Updated on: Sep 20, 2026 | 10:05 AM

Share

విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికులు ఆస్తమా ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కౌలాలంపూర్ ఎయిర్‌ పోర్టు నుంచి సిడ్నీకి బయల్దేరింది. అయితే ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న భారత్‌కు చెందిన ఓ ప్రయాణికుడు మధ్య మార్గంలో ఆస్తమా ఎటాక్‌కు గురయ్యారు. అది గమనించిన తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది అతనికి ప్రథమ చికిత్స అందించినప్పటికీ.. ఎలాంటి లాభం లేకపోయింది. ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సుమారు 8 గంటల ప్రయాణం తర్వాత సిడ్నీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవ్వగానే.. సాయంత్రం 5:50 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ టెర్మినల్ వద్దకు చేరుకున్నారు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు.. ఆ ప్రయాణికుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని హాస్పిటల్‌కు తరలించారు. అయితే అతని మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని.. ఇది అనారోగ్య సమస్య కారణంగా జరిగిన మరణమని స్పష్టం చేశారు.

ఆస్తమా ఎటాక్ అంటే ఏమిటి!

శ్వాసనాళాలు వాచిపోయి, కుంచించుకుపోయినప్పుడు ఊపిరితిత్తులలోకి గాలి వెళ్లడం కష్టంగా మారుతుంది.. దీన్నే ఆస్తమా ఎటాక్ అంటారు. ఇది తీవ్రమైనప్పుడూ శ్వాస ఆడకపోవడం, విపరీతమైన దగ్గు, ఛాతీ బిగుతుగా ఉండటం వంటివి జరుగుతాయి. ఇక విమానం ప్రయాణం వంటి హాస్పిటల్స్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇలాంటి సమస్య తలెత్తడం మరింత ఆందోళనకరం. కాబట్టి ఎప్పుడైనా ఈ లక్షణాలు తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

విమాన ప్రయాణంలో ఆస్తమా ఎటాక్ వస్తే ఏం చేయాలి?

మీరు ఫ్లైట్‌లో ఉన్న ఆస్తమా ఎటాక్ వస్తే వెంటనే కాల్ బటన్ నొక్కి, విమాన సిబ్బందికి స్పష్టంగా చెప్పండి. సిబ్బంది విమానంలోని మెడికల్ ఎమర్జెన్సీ విధానాలను ప్రారంభించి, సహాయం కోరుతారు.

అలాగే ఈ సమస్య తలెత్తినప్పుడు పడుకోకుండా నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రశాంతంగా ఉండడండి.. అలా కాదని కంగారు పడితే స్వాస తీసుకోవడం మరింత ఇబ్బంది అవుతుంది.

అలాగే వైద్యులు సూచించిన రిలీవర్ ఇన్‌హేలర్‌ను ఎప్పుడూ వెంటనే పెట్టుకోవాలి. ఇన్‌హేలర్‌ రకాన్ని బట్టి వేర్వేరు సూచనలు ఉంటాయి కాబట్టి, వైద్యుడి సలహాను కచ్చితంగా పాటించండి.

అలాగే ఆస్తమా ఉన్నవారు తమ రిలీవర్ ఇన్‌హేలర్‌ను బ్యాగ్‌లోపలి బాగాల్లో దాచుకోవద్దు.. దాన్ని వెంటనే తీసుకునేలా హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉంచుకోండి.

అలాగే ఆస్తమా ఉన్న వ్యక్తులు.. ఫ్లైట్ జర్నీ చేసే ముందు హాస్పిటల్‌కు వెళ్లి మీ పరిస్థితి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల మీరు మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us