AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump: ఏఐ అభివృద్ధిని నిలిపేసే ప్రసక్తే లేదు..‘ఏఐ ఫోర్స్’, ప్రత్యేక ‘ఏఐ జార్’ను నియమించనున్న ట్రంప్!

Trump: ఏఐ వేగం తగ్గించాలని విజ్ఞప్తులు ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి కొన్ని రోజుల ముందే ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' సిఈఓ దారియో అమోడీ ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రంగాన్ని తీవ్రంగా పర్యవేక్షించాల్సిన అవసరం...

Trump: ఏఐ అభివృద్ధిని నిలిపేసే ప్రసక్తే లేదు..‘ఏఐ ఫోర్స్’, ప్రత్యేక ‘ఏఐ జార్’ను నియమించనున్న ట్రంప్!
Trump
Subhash Goud
|

Updated on: Sep 20, 2026 | 10:17 AM

Share

Trump: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అభివృద్ధితో మానవాళికి ప్రమాదం పొంచి ఉందంటూ, దీని వేగాన్ని తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ రంగ నియంత్రణ, పర్యవేక్షణ కోసం ‘ఏఐ ఫోర్స్’ను ఏర్పాటు చేయడంతో పాటు, త్వరలోనే ఒక ప్రత్యేక ‘ఏఐ జార్’ (AI Czar)ను నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఏఐ అభివృద్ధిని అడ్డుకోం:

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. ఏఐ సాంకేతికతను, డేటా సెంటర్లను విమర్శిస్తున్న వారిపై మండిపడ్డారు. లిబరల్స్ కోరుకుంటున్నట్లుగా ఈ రంగాన్ని నాశనం చేయడానికి తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. ఈ అద్భుతమైన పరిశ్రమ ఎదుగుదలను మేం ఏమాత్రం అడ్డుకోము లేదా నిరోధించము. ఇది విస్తరిస్తున్న కొద్దీ దీనిని గౌరవిస్తాం, ప్రోత్సహిస్తాం, జాగ్రత్తగా పర్యవేక్షిస్తాం అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఏఐ వల్ల ముప్పు ఉందనే ప్రచారాన్ని డెమోక్రాట్లు చేస్తున్న ఒక అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు. అంతకుముందు మాట్లాడిన ఆయన, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదం సరిగ్గా లేదని, దీని స్థానంలో ‘సుపీరియర్ ఇంటెలిజెన్స్’ లేదా ‘ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్’ అని పిలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఏఐ వేగం తగ్గించాలని విజ్ఞప్తులు ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి కొన్ని రోజుల ముందే ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంత్రోపిక్’ సిఈఓ దారియో అమోడీ ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రంగాన్ని తీవ్రంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడగా, ఎలోన్ మస్క్ కూడా దీనికి మద్దతు తెలిపారు. ఏఐ మోడళ్లను విడుదల చేసే ముందే వాటి భద్రతా సమస్యలను సరిచూసుకోవాలని సూచించారు.

ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ అధిపతి డారియో అమోడెయ్, ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, దానిని నిశితంగా పర్యవేక్షించాలని పిలుపునిచ్చిన వారం రోజుల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అమోడెయ్‌కు ఆయన బద్ధ శత్రువైన ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us