AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవ్వును కరిగించి.. లివర్‌ను క్లీన్ చేస్తుంది.. ఉదయాన్నే ఓ కప్పు తింటే శరీరంలో జరిగే మార్పు ఇదే..

ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది కాలేయాన్ని శుద్ధి చేసి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, మొలల నివారణకు బొప్పాయి చక్కటి పరిష్కారం. ఈ పండుతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు..

Shaik Madar Saheb
|

Updated on: Sep 20, 2026 | 8:42 AM

Share
బొప్పాయి పండులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయిలో కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, ప్రోటీన్ తోపాటు.. విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ కె, బీటా-కెరోటిన్, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.

1 / 5
అందుకే.. ప్రతిరోజు ఉదయం బొప్పాయి పండు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయి పండు కాలేయాన్ని డీటాక్సిఫై చేసి, దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అలాగే, మలబద్ధకంతో బాధపడేవారికి బొప్పాయి ఒక వరం లాంటిది. ఇందులో ఉండే ఫైబర్ పేగుల్లో కదలికలను ప్రేరేపించి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

2 / 5
షుగర్ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి ఒక సురక్షితమైన పండు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు కూడా నిర్భయంగా తినవచ్చు. బొప్పాయిలో సమృద్ధిగా ఉండే సాల్యుబుల్ ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

3 / 5
పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల బొప్పాయి రక్తంలోని సోడియం నిల్వలను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది థైరాయిడ్ సమస్యల నుండి బయటపడటానికి, ముఖ్యంగా హైపర్ థైరాయిడిజంను తగ్గించడానికి తోడ్పడుతుంది.

4 / 5
బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించి, మోకాళ్ళ నొప్పుల వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మొలల వ్యాధితో బాధపడేవారికి కూడా బొప్పాయిలోని ఫైబర్ ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే.. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

5 / 5
Follow Us