AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs BANW Highlights: బంగ్లాపై ఘన విజయం.. ఫైనల్ చేరిన, భారత్..

India Women vs Bangladesh Women Highlights: ఆసియా క్రీడల మహిళల క్రికెట్ సెమీ-ఫైనల్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 114 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా, బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ అయింది. సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్‌లో భారత్, శ్రీలంకతో తలపడనుంది.

INDW vs BANW Highlights: బంగ్లాపై ఘన విజయం.. ఫైనల్ చేరిన, భారత్..
Ind W Vs Ban W Live Score Updates
Venkata Chari
| Edited By: |

Updated on: Sep 20, 2026 | 2:27 PM

Share

INDW vs BANW Live Score: ఆసియా క్రీడల మహిళల క్రికెట్ సెమీ-ఫైనల్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 114 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ అయింది. సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్‌లో భారత్, శ్రీలంకతో తలపడనుంది.

భారత్ తరపున, షెఫాలీ వర్మ 49 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు చేసింది. ఆమె హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి మూడో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

బౌలింగ్ విభాగంలో, దీప్తి శర్మ, నందిని శర్మ చెరో మూడు వికెట్లు తీయగా, శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టారు. భారత్ ఆరంభం నుంచే బంగ్లాదేశ్‌పై ఒత్తిడి తెచ్చి వారిని 81 పరుగులకే ఆలౌట్ చేసింది.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జి కమలిని, రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, నందనీ శర్మ.

బంగ్లాదేశ్: నిగర్ సుల్తానా (కెప్టెన్/వికెట్ కీపర్), దిలారా అక్టర్, జుయారియా ఫెర్దౌస్, శోభనా మొస్తరి, షర్మిన్ అక్టర్, షోర్నా అక్టర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్టర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్టర్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 20 Sep 2026 01:27 PM (IST)

    ఫైనల్ చేరిన భారత్

    ఆసియా క్రీడల మహిళల క్రికెట్ సెమీ-ఫైనల్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 114 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా, బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ అయింది. సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్‌లో భారత్, శ్రీలంకతో తలపడనుంది.

  • 20 Sep 2026 12:50 PM (IST)

    5 వికెట్లు కోల్పోయిన బంగ్లా..

    బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 9.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.

  • 20 Sep 2026 12:38 PM (IST)

    ముగిసిన పవర్ ప్లే

    పవర్ ప్లే ముగిసే సరికి బంగ్లాదేశ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. నందిని శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణి తలో వికెట్ తీశారు.

  • 20 Sep 2026 12:22 PM (IST)

    2 వికెట్లు కోల్పోయిన బంగ్లా

    2.3 ఓవర్లకు బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. నందిని శర్మ, క్రాంతి గౌడ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

  • 20 Sep 2026 12:01 PM (IST)

    బంగ్లా టార్గెట్ 196

    టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ్ 49 బంతుల్లో సెంచరీతో ఆకట్టుకుంది.

  • 20 Sep 2026 11:48 AM (IST)

    హర్మన్ ప్రీత్ ఔట్..

    17.4 ఓవర్లలో భారత్ 3వికెట్లు కోల్పోియ 179 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ 40 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.

  • 20 Sep 2026 11:35 AM (IST)

    15 ఓవర్లకు భారత్..

    15 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు పూర్తి చేసింది. ఈ ఓవర్లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి.

  • 20 Sep 2026 11:21 AM (IST)

    12 ఓవర్లకు

    12  ఓవర్లకు భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. షెఫాలీ 56, హర్మన్ ప్రీత్ 13 పరుగులతో నిలిచారు.

  • 20 Sep 2026 11:15 AM (IST)

    షెఫాలీ హాఫ్ సెంచరీ..

    కేవలం 24 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుంది. ఇందులో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి.

  • 20 Sep 2026 11:07 AM (IST)

    2వ కోల్పోయిన భారత్

    8.3 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. మరోవైపు షెఫాలీ 44 పరుగులతో క్రీజులో నిలిచింది.

  • 20 Sep 2026 10:54 AM (IST)

    మంధాన @ 100

    భారత ఓపెనర్ స్మృతి మంధాన మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంది. ఐదో ఓవర్‌లోని ఐదో బంతికి సిక్సర్ కొట్టి ఆమె ఈ ఘనతను సాధించింది. అదే ఓవర్‌లో భారత్ స్కోరు 50 పరుగులు దాటింది.

    134 – సోఫీ డివైన్ (న్యూజిలాండ్)

    134+ – డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్)

    120 – చమరి అథాపత్తు (శ్రీలంక)

    100 – స్మృతి మంధాన (భారతదేశం)*

  • 20 Sep 2026 10:43 AM (IST)

    3 ఓవర్లకు..

    3 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది.

  • 20 Sep 2026 10:35 AM (IST)

    INDW vs BANW Live Score: ఓపెనర్లుగా మంధాన, షెఫాలీ

    టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా మంధాన, షెఫాలీ బరిలోకి వచ్చారు.

  • 20 Sep 2026 10:23 AM (IST)

    బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11

    బంగ్లాదేశ్: నిగర్ సుల్తానా (కెప్టెన్/వికెట్ కీపర్), దిలారా అక్టర్, జుయారియా ఫెర్దౌస్, శోభనా మొస్తరి, షర్మిన్ అక్టర్, షోర్నా అక్టర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్టర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్టర్.

  • 20 Sep 2026 10:23 AM (IST)

    టీమిండియా ప్లేయింగ్ 11

    భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జి కమలిని, రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, నందనీ శర్మ.

  • 20 Sep 2026 10:17 AM (IST)

    టాస్ గెలిచిన భారత్..

    ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న మహిళల క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టాస్ మరికొద్ది సేపట్లో జరగనుంది.

Published On - Sep 20,2026 10:17 AM

Follow Us