Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంచే చేను మేస్తే ఎలా..? నేషనల్ మెడికల్ కమిషన్‌లో ఇంటి దొంగలు.. భారీ స్కాం బట్టబయలు

దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజీలను తనిఖీ చేయాల్సిన నేషనల్ మెడికల్ కమిషన్‌లో భారీ స్కాం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దేశవ్యాప్తంగా 36 మంది వైద్యులు, పలు మెడికల్ కాలేజీలపై CBI కేసు నమోదు చేసింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు వైద్యులు సైతం ఉండటం విశేషం. అసలేంటి మెడికల్ స్కాం దీన్ని ఫ్రాడ్ చేశారు.? మెడికల్ కాలేజీలను అనునిత్యం తనిఖీ చేయాల్సిన అధికారుల ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కయి వారికి ముందస్తు సమాచారం చేరవేస్తూ తనిఖీ జరిగిన సమయంలో ఎలాంటి అవకతవకలు లేవు అని నిరూపించేలా ముందస్తు సమాచారాన్ని లీక్ చేస్తున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ లోని ఇన్స్పెక్షన్ సభ్యులుగా ఉన్న పలువురితో కలిసి కేంద్ర ప్రభుత్వ హెల్త్ అండ్ వెల్ఫేర్ శాఖలోని పలువురు అధికారులు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారు..

కంచే చేను మేస్తే ఎలా..? నేషనల్ మెడికల్ కమిషన్‌లో ఇంటి దొంగలు.. భారీ స్కాం బట్టబయలు
NMC inspection team scam
Lakshmi Praneetha Perugu
| Edited By: Srilakshmi C|

Updated on: Jul 04, 2025 | 6:21 PM

Share

సాధారణంగా మెడికల్ కాలేజీలో వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుంది. మెడికల్ కాలేజీలలో పరికరాలు, వసతులు మెడికల్ కాలేజీల అనుమతులు, రెన్యువల్ చేసుకునే విధానాలపై పటిష్టమైన నిబంధనలు కేంద్ర ప్రభుత్వం విధించింది. వీటి మొత్తాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ లో పనిచేసే పలువురు అధికారులు పరిస్థితి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీరితోపాటు నేషనల్ మెడికల్ కమిషన్ లో పనిచేసే ఇన్స్పెక్షన్ బృందంలోని సభ్యులు మెడికల్ కాలేజీలకు వెళ్లే ముందే ఏ కాలేజీ కి వెళ్తున్నామో వారికి ముందస్తు సమాచారం ఇచ్చి వారి నుండి పెద్ద మొత్తంలో ముడుపులు వసూలు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షలు కోట్ల రూపాయలను ఈ తరహాలో అక్రమంగా సంపాదిస్తున్నారు.

ఈ భాగోతం కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అనేక మెట్రో నగరంలో ఉన్న మెడికల్ కాలేజీలలో ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఈ వ్యవహారం నడుస్తుంది. మెడికల్ కాలేజీలలో తనిఖీకి వెళ్లే ముందే ఆయా కళాశాలలకు ఎంఎంసీలోని కీలక సభ్యుల నుంచి సమాచారం వెళ్ళటంతో మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకొని తనిఖీ సమయంలో వచ్చిన అధికారులకు లక్షల రూపాయలు అప్పజెబుతున్నారు. బెంగళూరు ఇండోర్లీ డిల్లీ ఉదయపూర్ ఏపీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీ ల యాజమాన్యాలను కాలేజీల డైరెక్టర్లను సిబిఐ నిందితుల జాబితాలో చేర్చింది.

ముందస్తు సమాచారాన్ని ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలకు చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు హవాలా మార్గంలో చెల్లింపులు వెళుతున్నట్టు సిబిఐ దర్యాప్తులో బయటపడింది. చతిస్గడ్ లోని రావత్ పురా సర్కార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చైర్మన్ రవిశంకర్ జి, అదే కాలేజీలో డైరెక్టర్ గా ఉన్న అతుల్ కుమార్ తివారి, రాజస్థాన్ గీతాంజలి యూనివర్సిటీ రిజిస్టర్ మయూర్, ముంబై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఛాన్స్లర్ డిపి సింగ్ , వైజాగ్ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ వెంకట్, ఫాదర్ కొలంబో మెడికల్ సైన్సెస్ వరంగల్ కాలేజ్ డైరెక్టర్ జోసెఫ్ పై కేస్ నమోదు చేశారు సిబిఐ అధికారులు. దీనితోపాటు నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యులు డాక్టర్ మంజప్ప, డాక్టర్ చరిత, డాక్టర్ రజిని రెడ్డి, డాక్టర్ అశోక్ లను సిబిఐ నిందితులుగా చేర్చింది. ఇక మరోవైపు నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ డైరెక్టర్‌తో పాటు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులు మొత్తం ఎనిమిది మంది ను సైతం సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది.ఈ విధంగా మొత్తం 36 మందిపై CBI ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి హర్యానాకు చెందిన డాక్టర్ వీరేంద్ర కుమార్ కీలకపాత్ర పోషించారు. ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరులో ఉన్న మెడికల్ కాలేజీలలో కావాల్సిన అనుమతులు ఇక్కడ తనిఖీల సందర్భంలో ముందస్తు సమాచారాన్ని కదిరి అనంతపురంకు చెందిన డాక్టర్ హరీ ప్రసాద్ ద్వారా ఏపీ తెలంగాణ్ లో ఉన్న పలు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లకు ముందస్తు తనిఖీ సమాచారం చెప్పిన వీరేంద్ర కుమార్..వీటితో పాటు వైజాగ్ లోని గాయత్రి మెడికల్ కాలేజీ, వరంగల్ లో నీ ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్ లకు కావలసిన పనులు మొత్తం హరి ప్రసాద్ తో పాటు డాక్టర్ అంకం రామ్ బాబు, డాక్టర్ కృష్ణ కిషోర్ సరి చేసేవారు. ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఇచ్చే డబ్బు మొత్తాన్ని దక్షిణ రాష్ట్రాల నుండి డాక్టర్ హరిప్రసాద్ కలెక్ట్ చేసేవారు. డాక్టర్ హరిప్రసాద్ నుండి డాక్టర్ వీరేంద్ర కుమార్ కి హవాలా రూపంలో ఈ డబ్బు చేరేది. వరంగల్ కొలంబో కాలేజ్ కు చెందిన ఫాదర్ జోసెఫ్ 2 దఫాలుగా 66 లక్షల రూపాయలను చెల్లించాడు.

కొద్దిరోజులు కూర్చుని అనంతపురం జిల్లా కదిరిలో డాక్టర్ హరిప్రసాద్ ఇంటిపై CBI అధికారులు తనిఖీలు చేశారు. కీలక డాక్యుమెంట్ లతోపాటు పలు సామాగ్రిని CBI స్వాధీనం చేసుకుంది. అధికారులు తనిఖీలకు వచ్చిన సందర్భంలో టెంపరరీగా ఫ్యాకల్టీని అద్దెకు తీసుకొచ్చి, ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగడలేదని ఇన్స్పెక్షన్ రిపోర్టు రాయించుకునేవారు. రిపోర్టు రాసినందుకు NMC సభ్యులకు లక్షల రూపాయల కొద్దీ ముడుపులు చెల్లించేవారు. ఇక NMC హెడ్ ఆఫీస్ లోను పలువురు సభ్యుల తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్స్పెక్షన్ జరగబోయే కాలేజీ లకు సంబంధించి రిపోర్టులను ఫోటోలు తీసి మరి ఆ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు పంపించి డబ్బులు దండుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అనేక చోట్ల CBI తనిఖీలు నిర్వహించింది. త్వరలోనే ఈ స్కాంలో అరెస్ట్ ల పర్వం కొనసాగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.