AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైన పటారం.. లోన లోటారం.. స్లీపర్ బస్సులకు డీప్ స్లీప్ తప్పదా..?

స్లీపర్ బస్సు.. ఇవాళా రేపూ హ్యాపీ జర్నీకి బండగుర్తైపోయింది. ఎందుకంటే, మిడిల్‌ క్లాసుకో, ఎబౌ మిడిల్‌ క్లాసుకో అందుబాటులోకి వచ్చిన ఫీల్‌ గుడ్‌ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. మీరూ ఎప్పుడో ఒకసారి స్లీపర్ బస్సులో జర్నీ చేసే ఉంటారుగా? చెప్పండి.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏ వైపు ఉంటుందో కనీసం వెతికారా? యాక్సిడెంట్ జరిగితే మీ పక్కనే ఉండే విండో ఎలా పగలగొట్టాలో తెలుసా? కనీసం, మంటల్ని ఆర్పే ఫైర్ ఎక్‌స్టింగ్విషర్ ఎక్కడుందో అడిగారా? వీటిలో ఏ ఒక్కటీ తెలీకుండానే భేషుగ్గా బిందాస్‌గా జర్నీ ముగించేశాం. అంటే.. మనం వంద శాతం అదృష్టవంతులమే..! లాస్ట్ మినిట్ జర్నీలు పెట్టుకునేవాళ్లకు, రైల్వే రిజర్వేషన్లు దొరకనివాళ్లకు స్లీపర్ బస్సు మంచి ప్రత్యామ్నాయమే. కానీ, స్లీపర్ బస్సుల్లో ఎక్కగానే చూడాల్సింది కర్టెన్లు, సెల్‌ఫోన్ చార్జర్లు, వాటర్ బాటిళ్లు కాదు.. సీట్‌ బెల్ట్‌లు, ఫైర్ ఎక్స్‌టింగిషర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయా.. లేవా.. చూసుకోవాలి. ఎందుకంటే, స్లీపర్ బస్సులు సౌకర్యవంతమే కాదు ప్రమాదకరం కూడా అని చాటిచెప్పే చేదు అనుభవాలు ఇక్కడ బోలెడన్ని. వరుస ప్రమాదాల్ని డీకోడ్ చేస్తున్నకొద్దీ, స్లీపర్ బస్సుల్లో లూప్‌హోల్స్ చాలాచాలా బైటపడుతున్నాయి. ఇవన్నీ కలిసి ప్యాసింజర్లకు ప్రాణసంకటంగా మారుతున్నాయి.

పైన పటారం.. లోన లోటారం.. స్లీపర్ బస్సులకు డీప్ స్లీప్ తప్పదా..?
Crackdown On Private Sleeper Buses
Balaraju Goud
|

Updated on: Apr 09, 2026 | 9:45 PM

Share

2013 అక్టోబరు 30… మహబూబ్‌నగర్ జిల్లా పాలెం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గుర్తుందా? తెల్లవారుఝామున వోల్వో బస్సుకు మంటలంటుకుని, 45 మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగానే కాలిబూడిదయ్యారు. ఒక్కరు కూడా మిగల్లేదు. అత్యంత విషాదకరమైన ఆ ఘటనకు కారణం అతివేగం, ప్లస్ బస్సు నిర్మాణ లోపం, ప్లస్ ట్రావెల్స్ కంపెనీ నిర్వాకం. పన్నెండేళ్ల తర్వాత గత ఏడాది నవంబర్‌లో అదే ట్రావెల్స్ బస్సులో మరో ట్రాజెడీ. రెండు నిండుప్రాణాలను బలితీసుకుంది. సో.. సమస్య ఎక్కడున్నట్టు? టోటల్ వ్యవస్థలోనే లోపం ఉందా? మరి, కడిగి శుద్ధి చెయ్యాల్సిందే కదా? అందుకే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లోనే ఒక పెద్ద సంస్కరణ రాబోతోంది. కాకినాడ జిల్లా గండేపల్లి దగ్గర జాతీయ రహదారిపై ట్రాలీని ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది ఓ ట్రావెల్స్ బస్సు.. అదృష్టవశాత్తూ అరవై మంది ప్రయాణీకులూ సురక్షితంగా బయటపడ్డారు. అటు జమ్ము కాశ్మీర్ కుప్వారా జిల్లాలో మరో ఘోరం, భీకరమైన మంటలంటుకుని ఏకంగా ఏడు బస్సులు కాలి బూడిదయ్యాయి. ఇక ఢిల్లీ జైపూర్ హైవేపై టిప్పర్‌ను ఢీకొట్టి బస్సులో మంటలు అంటుకుని ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ఘటనా స్థలంలో పెద్దపెట్టున ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించాయి. గురువారం (ఏప్రిల్ 09) తెల్లవారగానే దేశం నలుమూలల నుంచీ వినబడ్డ మూడు ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఇవి. విచిత్రం ఏంటంటే మూడు ఘటనల్లోనూ మంటల్లో చిక్కుకున్నది స్లీపర్ బస్సులే. మరి, బెర్త్ బుక్ చేసుకుని హాయిగా నిద్రపోయి, మేలుకునేలోగా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి