Gold Rates: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..?
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే స్పల్పంగా పెరుగుదుల నమోదైంది. ఇటీవల గోల్డ్ రేట్లల్లో భారీ హెచ్చతగ్గులు నమోదవుతున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్ధం కావడం లేదు. ఈ రోజు ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price: బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిణామాలతో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు ఆమాంతం పెరుగుతూ వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆల్ లైం రికార్డ్ స్థాయికి చేరుకునే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదు చేయగా.. ఇవాళ గోల్డ్ రేట్లు స్పల్పంగా పెరిగాయి.
గోల్డ్ రేట్లు ఇలా..
-హైదరాబాద్‌లో 24 గ్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,590కి చేరుకుంది. నిన్న రూ.1,30,580గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,19,710కి చేరుకుంది. నిన్న ఈ ధర రూ.1,19,700గా ఉంది..
-విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,400గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,533గా ఉంది
-ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,740గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,860గా ఉంది.
-ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,580గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,20,610గా ఉంది.
ఇక బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,590గా ఉండగా.. 232 క్యారెట్ల ధర రూ.1,19,100గా ఉంది.
వెండి ధరలు ఇలా..
-ఇక వెండి ధరలు నేడు స్పల్వంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 1 గ్రాము వెండి ధర రూ.201.10గా ఉండగా కేజీ వెండి ధర రూ.2,01,100కి చేరుకుంది. నిన్న కేజీ వెండి ధర రూ.2,01,000గా ఉండగా.. నేడు రూ.100 పెరిగింది.
-విజయవాడలో కేజీ వెండి ధర రూ.2,01,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,01,000గా ఉంది
-ఇక ఢిల్లీలో కేజీ వెండి రూ.1,91,100 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.1,91,000గా ఉంది
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,01,100 వద్ద కొనసాగుతోంది.. నిన్న ఈ ధర రూ.2,01,000గా ఉంది
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.1,91,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,91,000గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




