Gold Prices: బంగారం ధరలపై బాబా వంగా సంచలన జోస్యం… వామ్మో కళ్లు చెదిరే లెక్కలు.. వచ్చే ఏడాదే ముప్పు..
ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె చెప్పే జోస్యాలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు బంగారం రేట్లు పెరుగుతుండటం, ఏఐ మానవ మనుగడకు సవాల్‌గా మారుతున్న క్రమంలో వంగా అంచనాల గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది.

Baba Vanga: బంగారం ధరలు సామాన్యులను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గిస్తారనే అంచనాలతో గోల్డ్ రేట్లల్లో గత కొద్దిరోజుల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. నేడు బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ తులం బంగారం రూ.1,30,580గా ఉండగా.. వెండి ధర రెండు లక్షల మార్క్‌ను దాటింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,01,000 వద్ద కొనసాగుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు కూడా 2 లక్షలకు చేరుకునే అవకాశముందనే వార్తల క్రమంలో బంగారం వైపు చూడాలంటేనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన జ్యోతిష్యురాలు అయిన బాబా వంగా గతంలో గేల్డ్ రేట్లపై చెప్పిన జోస్యం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.
40 శాతం పెరగనున్న గేల్డ్ రేట్లు
బాబా వంగా మరణించినప్పటికీ.. భవిష్యత్ గురించి ఆమె చెప్పినవన్నీ దాదాపు నిజమయ్యాయి. ఆమె అంచనా వేసినవన్నీ నిజమవుతున్నాయి. తాజాగా బంగారం రేట్లు భారీగా పెరుగుతుండటం, దాని గురించి ఎక్కువమంది చర్చించుకుంటున్న క్రమంలో ఈ విషయంపై బాబా వంగా ఏం చెప్పారనేది సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె అంచనా ప్రకారం.. గోల్డ్ రేట్లు ఊహించనంతగా పెరుగుతాయట. 2026 నాటికి ఏకంగా25 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందట. ప్రస్తుతం తులం బంగారం లక్షన్నరగా ఉండగా..2026 నాటికి 40 శాతం వరకు పెరగనున్నాయని బాబా వంగా అంచనాలు చెబుతున్నాయి.
ఏఐ గురించి జోస్యం
2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా ఆస్ధిరంగా మారుతుందని, తీవ్రమైన సంక్షోభం ఏర్పడే అవకాశముందని బాబా వంగా అంచనా వేశారు. దీని వల్ల బ్యాంకింగ్ రంగానికి భారీగా నష్టం జరుగుతుందన్నారు. కరెన్సీ విలువ తగ్గిపోవడం, ద్రవ్యత తగ్గడంతో ఆర్ధిక వ్యవస్థకు పెనుముప్పు ఏర్పడుతుందని తన అంచనాల్లో పేర్కొన్నారు. దీని వల్ల పెట్టుబడిదారులు బంగారం, వెండిపై ఇన్వెస్ట్ చేస్తారని, ఈ కారణాలతో ఊహించని విధంగా రేట్లు పెరుగుతాయని జోస్యం చెప్పారు.అలాగే 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన తుఫాన్లు, సునామీలు, భూకంపాలు ఏర్పడాతాయని, ఇక గ్రహాంతరవాసులతో మానవులకు ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయని అంచనా వేశారు. ఇక ఏఐ టెక్నాలజీ అత్యంత ప్రమాదకరంగా మారి మానవ మనుగుడకు ముప్పు తెస్తుందన్నారు.




