AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ కోసం పనిచేసిన గగన్‌ దీప్‌ అరెస్ట్‌! ISIతో స్ట్రాంగ్‌ రిలేషన్‌..

పంజాబ్ పోలీసులు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న గగన్‌దీప్ సింగ్‌ను అరెస్టు చేశారు. అతను ఖలిస్తాన్ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో కలిసి భారతీయ సైనిక కదలికల గురించి సమాచారం లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐఎస్ఐతో అతని సంబంధం, చావ్లా ద్వారా పొందిన చెల్లింపులు దర్యాప్తులో బయటపడ్డాయి.

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ కోసం పనిచేసిన గగన్‌ దీప్‌ అరెస్ట్‌! ISIతో స్ట్రాంగ్‌ రిలేషన్‌..
Gopal Singh Chawla With Haf
SN Pasha
|

Updated on: Jun 03, 2025 | 1:42 PM

Share

పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో పాటు ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో బలమైన సంబంధాలున్న గగన్‌ దీప్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసు చీఫ్ మంగళవారం తెలిపారు. నిందితుడు ఆపరేషన్ సిందూర్ సమయంలో సహా సరిహద్దు వెంబడి ఉన్న ఏజెంట్లతో ఆర్మీ కదలికల గురించి కీలకమైన సమాచారాన్ని చాలా సంవత్సరాలుగా పంచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అరెస్టయిన నిందితుడు గగన్‌దీప్ సింగ్, దళాల మోహరింపులు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన వర్గీకృత సమాచారాన్ని లీక్ చేశాడని, ఇది జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని అధికారులు తెలిపారు.

గత ఐదు సంవత్సరాలుగా గగన్‌దీప్ సింగ్ పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని, అతని ద్వారా అతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(PIO) పరిచయం అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను భారతీయ మార్గాల ద్వారా PIOల నుండి చెల్లింపులు కూడా అందుకున్నాడు అని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ తెలిపారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లో పాకిస్తాన్ ఏజెంట్లతో అతను పంచుకున్న నిఘా సమాచారం గురించి కీలక సమాచారం బయటపడింది. గోపాల్‌కు 20 మందికి పైగా ఐఎస్ఐ ప్రతినిధులతో పరిచయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

చావ్లాకు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో కూడా సంబంధం ఉందని, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో దిగిన ఫోటోలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు 26 మందిని హతమార్చిన పహల్గామ్ దాడి తర్వాత.. ఇండియాలో ఉన్న పాకిస్థాన్‌ స్పైలను పట్టుకునేందుకు కేంద్ర చర్యలు ముమ్మరం చేసింది. గత రెండు వారాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుండి డజనుకు పైగా వ్యక్తులను అరెస్టు చేశారు. ఉత్తర భారతదేశం అంతటా పనిచేస్తున్న పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న గూఢచారి నెట్‌వర్క్ ఉనికిని దర్యాప్తులు సూచిస్తున్నాయి. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. యూట్యూబ్‌లో 3.77 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న హర్యానా నివాసి జ్యోతి మల్హోత్రా, పంజాబ్‌కు చెందిన 31 ఏళ్ల గుజాలా, CRPF సిబ్బందిని కూడా అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..