AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేనల్లుడిని చంపి, ముక్కలు చేసి కాంక్రీట్‌లో పూడ్చిన అత్త..! కారణం ఏంటంటే..

మే 23న అతని భార్య నస్రీన్ ఖాతున్ మాల్డాలోని పుకురియా పోలీస్ స్టేషన్‌లో కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది . ఫిర్యాదులో సద్దాం బంధువులు రెహ్మాన్ నదాఫ్, మౌమితా హసన్ కిడ్నాప్‌కు పాల్పడినట్లు అనుమానించారు.. ప్రేమ వ్యవహారం, వ్యాపార లావాదేవీలు, బ్లాక్‌మెయిలింగ్ వంటి కోణాల్లో పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. సద్ధాంకు మేనత్త అయిన మౌమితనే నిందితురాలిగా గుర్తించారు.

మేనల్లుడిని చంపి, ముక్కలు చేసి కాంక్రీట్‌లో పూడ్చిన అత్త..! కారణం ఏంటంటే..
Crime News
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2025 | 1:30 PM

Share

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఓ షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని మల్దా జిల్లాలో ఒక ఇంటి స్లాబ్‌లో వ్యక్తి మృతదేహం కనిపించటం కలకలం రేపింది. కొత్త ఇంటి స్లాబ్‌లో వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడి ఇంటి కాంక్రీట్‌ స్లాబ్‌లో 31 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానికంగా పని చేస్తున్న లేబర్‌ కాంట్రాక్టర్‌ సద్ధామ్‌ నదాబ్‌అనే వ్యక్తిగా గుర్తించారు. మాల్దా జిల్లాలో మే 18న అదృశ్యమైన సద్దామ్ నదాబ్‌ అనే లేబర్ కాంట్రాక్టర్‌ను అతని అత్త మౌమితా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే…

మృతుడు సద్దాం నదాఫ్ మాల్డాలోని ఇంగ్లీష్ బజార్ నివాసి. అతను ఇతర రాష్ట్రాలకు కార్మికులను పంపేవాడు. మే 18 రాత్రి తన కార్యాలయం నుండి బయటకు వెళ్ళిన తర్వాత అతను తిరిగి రాలేదు. మే 23న అతని భార్య నస్రీన్ ఖాతున్ మాల్డాలోని పుకురియా పోలీస్ స్టేషన్‌లో కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది . ఫిర్యాదులో సద్దాం బంధువులు రెహ్మాన్ నదాఫ్, మౌమితా హసన్ కిడ్నాప్‌కు పాల్పడినట్లు అనుమానించారు.. ప్రేమ వ్యవహారం, వ్యాపార లావాదేవీలు, బ్లాక్‌మెయిలింగ్ వంటి కోణాల్లో పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. సద్ధాంకు మేనత్త అయిన మౌమితనే నిందితురాలిగా గుర్తించారు.

మృతుడు సద్దాం, మౌమిత అనే మహిళతో వ్యాపారంతో పాటుగా, ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి తీసుకున్న తన ఫోటోలు బయటపెడతానని బెదిరించడంతో మౌమిత మేనల్లుడైన సద్దామ్‌ను హత్య చేసి, ముక్కలుగా చేసి, సిమెంటు కాంక్రీట్ ఉపరితలం కింద పూడ్చినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసును ఆర్థిక కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..