Watch: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టి సారీ చెప్పిన మహిళ.. నెటిజన్లు ఫైర్
పంఖూరి మిశ్రా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోడ్డు వివాదంలో ఆటో డ్రైవర్ లోకేశ్‌ను హిందీలో దూషించి, చెప్పుతో కొట్టారు. బాధిత ఆటో డ్రైవర్ లోకేశ్ ఫోన్‌లో సదరు మహిళ చేసిన అరాచకమంతా తన మొబైల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. చివరకు వీడియో పోలీసులకు చేరింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఒక మహిళకు, ఆటో డ్రైవర్ కు మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఈ వీడియోలో ఒక మహిళ తన స్కూటర్ ను ఢీకొట్టినట్టుగా ఆరోపిస్తూ ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొడుతోంది. ఇలాంటి షాకింగ్ ఘటన మే 30 శనివారం రోజున జరిగినట్టుగా తెలిసింది. ఆటో డ్రైవర్ ఇదంతా తన సెల్ ఫోన్‌లో రికార్డ్ చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరులో జరిగిన ఒక షాకింగ్ సంఘటన నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. స్కూటీపై వచ్చిన ఒక మహిళ ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన ఘటన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా కలకలం రేపింది. పంఖూరి మిశ్రా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోడ్డు వివాదంలో ఆటో డ్రైవర్ లోకేశ్‌ను హిందీలో దూషించి, చెప్పుతో కొట్టారు. బాధిత ఆటో డ్రైవర్ లోకేశ్ ఫోన్‌లో సదరు మహిళ చేసిన అరాచకమంతా తన మొబైల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. చివరకు వీడియో పోలీసులకు చేరింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు.
వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి మిశ్రాను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మహిళ చేసిన పనికి ఆమెతో క్షమాపణ చెప్పించారు. చివరకి మిశ్రా తన భర్తతో కలిసి ఆటో డ్రైవర్ లోకేశ్‌ను క్షమాపణ కోరారు. కానీ, వీడియో మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మహిళ ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




