AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండింగ్.. ఒక్కసారిగా దుమ్ము తుఫాన్ బీభత్సం.. సీన్ కట్ చేస్తే

దేశ రాజధాని దక్షిణ ప్రాంతాలలో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచాయి. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీచాయి. ఐజిఐ విమానాశ్రయం ఉన్న పాలంలో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గంటకు 65 కి.మీ వేగంతో గాలులు వీచాయి. ప్రగతి మైదాన్ వద్ద, గాలులు గంటకు 76 కి.మీ. వేగంతో వీచాయని అధికారులు వెల్లడించారు.

ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండింగ్.. ఒక్కసారిగా దుమ్ము తుఫాన్ బీభత్సం.. సీన్ కట్ చేస్తే
Indigo Flight
Jyothi Gadda
|

Updated on: Jun 02, 2025 | 1:07 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాను విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా గాల్లో ఉన్న ఇండిగో విమానం ఒకటి భారీ కుదుపులకు లోనైంది. కుండపోత వర్షం, ఈదురు గాలుల కారణంగా రాయ్‌పూర్ – ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఆదివారం సాయంత్రం దుమ్ము తుఫాను కారణంగా రాయ్‌పూర్ నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ల్యాండింగ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడేంత వరకూ విమానం కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగబోతుండగా గంటకు 80 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయని అధికారులు వెల్లడించారు. విమానం లోపల అల్లకల్లోలాన్ని ప్రయాణీకులు రికార్డ్ చేశారు.

విమానం గాల్లో ఉండగా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి విమానం ల్యాండింగ్‌ను నిలిపివేశారు. విమానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. అలాగే గాల్లో కాసేపు చక్కర్లు కొట్టింది. దాదాపు 40 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతితో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో దుమ్ము తుఫాను సంభవించింది. తరువాత తేలికపాటి వర్షం కురిసింది. తూర్పు-ఆగ్నేయం వైపు కదులుతున్న మేఘాలతో వర్షం పడింది. దేశ రాజధాని దక్షిణ ప్రాంతాలలో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచాయి. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీచాయి. ఐజిఐ విమానాశ్రయం ఉన్న పాలంలో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గంటకు 65 కి.మీ వేగంతో గాలులు వీచాయి. ప్రగతి మైదాన్ వద్ద, గాలులు గంటకు 76 కి.మీ. వేగంతో వీచాయని అధికారులు వెల్లడించారు.

ఆదివారం సాయంత్రం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో నాలుగు విమానాలను దారి మళ్లించగా, 350 కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. సాయంత్రం 5:00 గంటల నుండి 5:30 గంటల మధ్య ఒక్కొక్క విమానాన్ని చండీగఢ్, అమృత్సర్‌లకు మళ్లించగా , రెండు విమానాలను జైపూర్‌కు పంపించారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభావితమైన విమానాల గురించి తాజా సమాచారం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలతో ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకోవాలని విమానాశ్రయ అధికారులు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..