Vemulawada: రాజన్న అలయంలో కోడెల మృత్యువాత.. స్వయంగా ఆరా తీసిన సీఎం.. త్వరలోనే..
కోడె మొక్కు చెల్లెస్తే..కోర్కెలు తిరుతాయాని భక్తుల నమ్మకం.. స్వామి దర్శనాని కంటే ముందు కోడె లను చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఎంతో మంది భక్తులు ఇక్కడ స్వామి వారికి కోడెలను మొక్కుగా చెల్లిస్తారు. కోడె మొక్కులతో కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా , కోడెల సంరక్షణ విషయం లో అధికారులు పట్టించుకోవడం లేదు. రాజన్న సన్నిధిలోనే శివుడి వాహనం కోడెలకు కష్టమొచ్చింది.. కోడెల మరణాలకు భాద్యులేవరు..? అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శివుని వాహనం నందిని దేవుడిలా కొలుస్తూ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.. రాజన్న ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో శివుని వాహనమైన కోడె మృత్యుఘోషతో విలవిలలాడుతున్నాయి. రాజన్నకు భక్తులు సమర్పించిన కోడేలు తిప్పాపూర్‌లోని గోశాలకు తరలిస్తుండగా ప్రస్తుతం అవి పరిమితికి మించి ఉండడం, పర్యవేక్షణ లోపం వాటికి శాపంగా మారింది. శుక్రవారం గోశాలలో 8 కోడెలు మృతిచెందగా గు ట్టుచప్పుడు కాకుండా సిబ్బంది పూడ్చి పెట్టారు. చేశారు.అయితే 24 గంటలు గడవక ముందే అదే గోశాలలో 5 కోడెలు మృతి చెందాయి. నిత్యం పదుల సంఖ్యలో స్వామివారి గోశాలలోని కోడెలు మృత్యువాత పడుతుండగా ఆలయ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెడుతున్నారు.
దక్షణ కాశిగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కు అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఏటా స్వామివారికి ఈ కోడె మొక్కుపై రూ. 22 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. అయితే భక్తులు సమర్పించిన నిజ కోడెలను రైతులకు అందజేసే విధానం ఉండగా పలు అవకతవకలకు పాల్పడంతో గత ఆరుమాసాలుగా పంపిణీని ఆలయ అధికారులు నిలిపివేశారు. ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం పరిశీలించి వ్యక్తిగతంగా వాటిని సంరక్షిస్తానని అఫిడవిట్ తీసుకొని అప్పగించే విధానం ఉండగా పెద్ద మొత్తంలో ఒకరికి అప్పగించగా వివాదానికి దారితీసింది. అయితే ప్రస్తుతం స్వామివారికి భక్తుల సమర్పిస్తున్న నిజ కోడేలను తిప్పాపూర్ గోశాలలో నిలువ ఉంచుతున్నారు. దాని పరిధిలో సుమారు 600 వరకే ఉండే వసతి సౌకర్యాలు ఉండగా ప్రస్తుతం రాజన్న గోశాలలో 1250 పైగా కోడెలు రావడంతో సరియైన వసతి సౌకర్యం లేక మృత్యువాత పడుతున్నట్లుగా భక్తులు ఆరోపిస్తున్నారు. వందల కోట్ల ఆదాయం ఉన్న కోడెల సంరక్షణలో రాజన్న ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
కోడెల మృతి పై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వైద్య సిబ్బంది ను ఏర్పాటు చేసి , గోశాలలో కోడెలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్యశిబిరం ఏర్పాటు చేసి గంటలు గడవక ముందే అదే తిప్పాపూర్ గోశాలలో 5 కోడెలు మృతి చెందడం ,అధికారుల వైఫల్యం మరోసారి బైటపడింది. శనివారం తిప్పాపూర్ లో ఉన్న గోశాలలో కోడెల మృత్యువాత కలకలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కోడెలు మృత్యువాత పడినట్లు ప్రచారం సాగుతుంది. గోశాలలో పలు ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా గోశాలను తనిఖీ చేశారు. వెంటనే వెటర్నరీ వైద్య బృందాన్ని గోశాలకు తరలించి, మిగిలిన గోవులకు తగిన వైద్యం అందింస్తున్నట్లు కలెక్టర్ ఆదేశించారు.
“వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన మొక్కలు చెల్లించే కోడెలకే ఇలాంటి దుస్థితి రావడం బాధాకరమని. దీనిపై అధికార స్థాయిలో పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని పేర్కొన్నారు. కోడెల మరణాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. గోశాలలో మౌలిక సదుపాయాల లేమి, పోషకాహార లోపం వంటి అంశాలపై అధికారులను నిలదీశారు. విచారణ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గోశాలలో పరిస్థితి ఆధ్వన్నంగా ఉందని హిందూ సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే, రాజన్న కోడెల మృతి విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజన్న కోడెల రక్షణ కోసం ఆధునిక సౌకర్యాలను కల్పించడంతో పాటు, కొత్త విశాలమైన గోశాల నిర్మాణం కోసం భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించినట్టుగా ప్రభుత్వ చీఫ్ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఖతార్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రిని నివాసంలో కలిసినట్టుగా చెప్పారు.
రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి, ఆలయ గోశాలకు సంబంధించిన వివిధ విషయాలను సీఎం వివరంగా అడిగి తెలుసుకున్నారని, అక్కడి ఆవులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయ పరిపాలన, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయని శ్రీనివాస్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్టుగా స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




