5 Rupees Coin: మాయదారి ఐదు రూపాయల కాయిన్.. చిన్నారి నిండు ప్రాణాన్ని మింగేసింది..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 07, 2021 | 10:59 AM

5 rupees coin: ఐదు రూపాయల కాయిన్ ఆయువు తీసింది. అవును.. మీరు చదివింది నిజమే. నాలుగేళ్ల చిన్నారి ఊపిరి ఆగిపోయేలా చేసింది. ఆడుకుంటూ.. ఆడుకుంటూ కాయిన్‌ నోట్లో పెట్టుకుందా ఆ చిన్నారి. అదికాస్త గొంతులోకి జారిపోయింది.

5 Rupees Coin: మాయదారి ఐదు రూపాయల కాయిన్.. చిన్నారి నిండు ప్రాణాన్ని మింగేసింది..
5 Rupees Coin

ఐదు రూపాయల కాయిన్ ఆయువు తీసింది. అవును.. మీరు చదివింది నిజమే. నాలుగేళ్ల చిన్నారి ఊపిరి ఆగిపోయేలా చేసింది. ఆడుకుంటూ.. ఆడుకుంటూ కాయిన్‌ నోట్లో పెట్టుకుందా ఆ చిన్నారి. అదికాస్త గొంతులోకి జారిపోయింది. ఆ క్షణం నుంచి చిన్నారి నరకయాతన అంతా ఇంతా కాదు. కర్నాటకలోని మైసూరు జిల్లా హుణసూరు మండలం ఆయరహళ్లిలో జరిగిందీ ఘటన. నాలుగేళ్ల చిన్నారి ఖుషి.. ఐదు రూపాయల కాయిన్‌తో సరదాగా ఆడుకుంది. ఆ క్రమంలో ఫైవ్ రూపీస్ కాయిన్ నోట్లో పెట్టుకుంది. అది పొరపాటున గొంతులోకి జారిపోయింది. చిన్నారి మాట ఆగిపోగానే కంగారుపడ్డ పేరెంట్స్‌ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే స్పందించి స్కానింగ్‌ చేశారు. అప్పుడు కాని తెలియలేదు ఆ ఐదురూపాయల కాయిన్ ఎక్కడ ఇరుక్కుందో..

స్కానింగ్ రిపోర్ట్‌లో ఛాతి భాగంలో ఐదు రూపాయల కాయిన్ ఉండిపోయినట్టు డాక్టర్లు గుర్తించారు. మరోవైపు గంట గంటకి ఖుషి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. డాక్టర్లు చిన్నారిని బతికించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్‌మెంట్‌ చేశారు. అయినా ఫలితం లేకుండాపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఖుషి ప్రాణాలు విడిచింది.

పిల్లలన్నాక గోల పెడతారు.. పిప్పరమెంట్‌, బిస్కెట్‌ ప్యాకెట్‌ కావాలని అల్లరి చేస్తారు. అలాగని వాళ్ల చేతికి రూపాయి బిళ్లలు ఇస్తున్నారా? అయితే జరభద్రం. మారం చేస్తే షాప్‌కి వెంట తీసుకెళ్లి కొనివ్వండి. అంతేగానీ రూపాయి కాయిన్లు మాత్రం ఇవ్వకండి.

ఇవి కూడా చదవండి: వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..

Acharya Chanakya: నీరు.. డబ్బు.. ఒకటే.. సంపాదించిన సంపదను ఏం చేయాలో చెప్పిన చాణక్యుడు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu