బావిలో నుంచి చిరుత పిల్లను రక్షించిన రెస్క్యూటీం

మహారాష్ట్రలోని పూణే సమీపంలో అటవీశాఖ అధికారులు ఓ చిరుతపులి పిల్లను గుర్తించారు. నగర శివారులోని పింపల్వాడీ గ్రామంలోని జున్నార్‌ బ్లాక్‌ సమీపంలో ఉన్న ఓ బావిలో చిరుతపులి పిల్లను చూశారు కొందరు.

బావిలో నుంచి చిరుత పిల్లను రక్షించిన రెస్క్యూటీం
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 2:55 PM

మహారాష్ట్రలోని పూణే సమీపంలో అటవీశాఖ అధికారులు ఓ చిరుతపులి పిల్లను గుర్తించారు. నగర శివారులోని పింపల్వాడీ గ్రామంలోని జున్నార్‌ బ్లాక్‌ సమీపంలో ఉన్న ఓ బావిలో చిరుతపులి పిల్లను చూశారు కొందరు. దీంతో విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో.. వారు దానిని బావి నుంచి సురక్షితంగా బయటకు తీసి రక్షించారు. ఆ తర్వాత దానికి వైద్య పరీక్షలు నిర్వహించి.. సమీప అడవుల్లో వదిలేశారు.

మరోవైపు సోమవారం నాడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూడా ఓ చిరుతను అటవీశాఖ అధికారులు రెస్క్యూ చేశారు. ఇండోర్‌ ఐఐటీ సమీపంలో పట్టుబడ్డ ఓ చిరుతను బంధించి.. సమీప అడవుల్లో వదిలేశారు. దీంతో ఐఐటీ క్యాంపస్‌ సిబ్బంది, విద్యార్ధులు ఊపిరి పీల్చుకున్నారు.