‘కరోడ్ పతీలైన’ బీహార్ ఏనుగులు.. ఎలా ?

గత కొన్ని వారాలుగా ఏనుగులకు సంబంధించిన విషాద ఘటనలు వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే బీహార్ లోని ఓ రెండు గజరాజులకు మాత్రంఈ వార్త అత్యంత సంతోషకరమైనదే ! కారణం..

'కరోడ్ పతీలైన' బీహార్ ఏనుగులు.. ఎలా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2020 | 2:15 PM

గత కొన్ని వారాలుగా ఏనుగులకు సంబంధించిన విషాద ఘటనలు వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే బీహార్ లోని ఓ రెండు గజరాజులకు మాత్రంఈ వార్త అత్యంత సంతోషకరమైనదే ! కారణం ? అవి ఒక్కసారిగా ‘కరోడ్ పతీలు’ (కోటీశ్వరులు) అయిపోయాయి. అఖ్తర్ ఇమామ్ అనే వ్యక్తి తన ఆస్తిలోసగభాగం ఈ గజరాజులకు రాసి ఇచ్ఛేశాడు. అవి తన పిల్లలవంటివని ఆయన అంటున్నాడు. తన మరణానంతరం అవి అనాధలుగా మిగిలిపోరాదని ఆయన అంటున్నాడు. వీటిలో రాణి అనే ఏనుగు వయస్సు 20 ఏళ్ళు కాగా..మోతీ అనే గజరాజు వయస్సు 15 సంవత్సరాలు. ఈ రెండూ అఖ్తర్ కి చాలా మాలిమి అయిపోయాయి. ఇతనికి కోట్లాది విలువైన భూములున్నాయి. తాను నిర్వహించే ఓ స్వచ్ఛంద సంస్థ తన తదనంతరం వీటి బాగోగులు చూసుకుంటుందని ఆయన అంటున్నాడు. తనపై స్థానిక గూండాలు రెండుసార్లు హత్యా యత్నం చేసినప్పుడు ఈ ఏనుగులే తనను రక్షించాయని ఆయన తెలిపాడు.