మరీ ఇంత దారుణమా.. రైలులో పరిచయమైన మహిళ కోసం.. భార్యను హత్య చేసిన భర్త
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని ఓ రిటైర్డ్ నేవీ ఉద్యోగి తన భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ఆమె గొంతు కోసి.. శరీరాన్ని ఛిద్రం చేశాడు. తల, చేతులు, కాళ్లు నరికేసి పలు ప్రాంతాల్లో విసిరేశాడు. మొండెం తగులబెట్టాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని ఓ రిటైర్డ్ నేవీ ఉద్యోగి తన భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ఆమె గొంతు కోసి.. శరీరాన్ని ఛిద్రం చేశాడు. తల, చేతులు, కాళ్లు నరికేసి పలు ప్రాంతాల్లో విసిరేశాడు. మొండెం తగులబెట్టాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషాద ఘటన హర్యాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ముకేశ్, సోనియా భార్యాభర్తలు. వీరికి ఓ పాప ఉంది. అయితే 2018లో ఓసారి ముఖేష్ బిహార్ నుంచి రైలులో వస్తుండగా అందులో ఓ మహిళ పరిచయమైంది. చివరికి ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
వీరిద్దరికీ ఓ చిన్నారి కూడా పుట్టింది. ఆమెను కలిసేందుకు ముకేశ్ తరచూ వెళ్లేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోనియాను అడ్డు తొలగించుకోవాలని ముకేశ్ భావించాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలనుకున్నాడు. ఏప్రిల్ 21న ఆమెను గొంతు కోసి చంపేశాడు. బాత్రూంలో మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. తలను ఓ చెరువులో పడేశాడు. పోలీసులకు ముఖేశ్ ఫిర్యాదు చేసిన అనంతంరం రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడు తన భర్త ముకేశ్ అని తేలడంతో అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.