అయ్యో ఏంటీ ఈ ఘోరం.. ముగ్గురు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి
బిహార్‌లోని గయా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లల్ని చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివిరాల్లోకి వెళ్తే్ మగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో మాల్తీ దేవీ అనే మహిళ తన భర్త, ముగ్గురు పిల్లలతో ఉంటుంది.
బిహార్‌లోని గయా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లల్ని చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివిరాల్లోకి వెళ్తే్ మగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో మాల్తీ దేవీ అనే మహిళ తన భర్త, ముగ్గురు పిల్లలతో ఉంటుంది. అయితే శనివారం రోజున తన పిల్లలకు ఉరేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.
అయితే ప్రాథమిక దర్యాప్తులో మాల్తీ దేవి భర్త.. ఆమెను వేధింపులకు గురిచేసేవాడనే విషయం తెలిసింది. బాధితురాలు బంధువులు కూడా మాల్తీదేవిని ఆమె భర్త చిత్రహింకలు పెట్టేవారని ఆరోపించారు. అందువల్లే ఆమె తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. దీంతో పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు.ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గురువారం రోజున మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ బ్యూటీ పార్లర్ వెళ్తానంటే తన భర్త అడ్డుచెప్పడంతో.. ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.