Covid-19: ఆ రాష్ట్రాల వారు వస్తే కరోనా నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి.. ఢిల్లీ, బెంగాల్‌ ప్రభుత్వాలు కీలక నిర్ణయం

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పూర్తిగా తగ్గుముఖం పట్టిందనకునే లోపు పలు రాష్ట్రాల్లో మళ్లీ తీవ్రతరమైపోయింది. కరోనా పాజిటివ్‌..

Covid-19: ఆ రాష్ట్రాల వారు వస్తే కరోనా నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి.. ఢిల్లీ, బెంగాల్‌ ప్రభుత్వాలు కీలక నిర్ణయం
Follow us
Subhash Goud

|

Updated on: Feb 25, 2021 | 1:26 AM

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పూర్తిగా తగ్గుముఖం పట్టిందనకునే లోపు పలు రాష్ట్రాల్లో మళ్లీ తీవ్రతరమైపోయింది. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు నిబంధనలు విధించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పశ్చిమబెంగాల్‌కు విమానాల్లో వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షను తప్పనిసరి చేసింది. తమ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు కోవిడ్‌ నెగెటివ్‌ నివేదికలు ఉండాలంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రయాణానికి మూడు రోజుల ముందు కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది ఆగస్టులో జారీ చేసిన ఈ ఆదేశాన్ని మరోసారి పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి ప్రయాణికులు ఆ ఆదేశాన్ని మరోసారి పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇదే తరహా నిబంధనలు విధించేందుకు ఢిల్లీ సైతం సిద్ధమవుతోంది. ఇప్పటికే కర్ణాటక, ఉత్తరాఖండ్‌, తమిళనాడు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఇలా కరోనా మహహ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముందస్తుగా పలు ఆంక్షలు విధిస్తూ నిబంధనలు మళ్లీ కఠినతరం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మాస్కులు లేని వారికి జరిమానా విధిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాల్లో మాస్కులు ధరించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో కేసుల సంఖ్య తీవ్రం అవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో కర్ప్యూ విధిస్తున్నారు.

Also Read: Coronavirus: ఆ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 9 వేలకు చేరిన రోజువారీ కేసుల సంఖ్య