Delhi: పిల్లలపై టీవీ షోల ప్రభావానికి పరాకాష్ట.. ‘సెలవుల కోసం కొట్టి చంపేశారు’
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం దయాళ్‌పూర్ ఏరియాలోని తలీముల్ ఖురాన్ మదర్సాలో చదువుకుంటున్న 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న ముగ్గురు చిన్నారులు మదర్సాకు సెలవిస్తారని తోటి బాలుడిని కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీలోని దయాల్‌పూర్ ప్రాంతంలోని మదర్సా తలీముల్ ఖురాన్ వెలుపలి నుంచి...
సమాజంలో రోజురోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా, టీవీ షోలు నేర ప్రవృతిని పెంచుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఈ దారుణాలకు బలి అవుతున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన సమాజం ఏమైపోతుందన్న ప్రశ్నలను లేవనెత్తుతోంది. సెలవుల కోసం 5 ఏళ్ల చిన్నారిని కొట్టి చంపారు. అయితే దాడి చేసిన చిన్నారులు కూడా చిన్న వయసు వారే కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం దయాళ్‌పూర్ ఏరియాలోని తలీముల్ ఖురాన్ మదర్సాలో చదువుకుంటున్న 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న ముగ్గురు చిన్నారులు మదర్సాకు సెలవిస్తారని తోటి బాలుడిని కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీలోని దయాల్‌పూర్ ప్రాంతంలోని మదర్సా తలీముల్ ఖురాన్ వెలుపలి నుంచి ఓ మహిళ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. మదర్సాలో చదువుతున్న తన ఐదేళ్ల కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని, ఏదో జరిగిందన్న అనుమానంతో పోలీసులకు విషయాన్ని తెలియజేశారు.
దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మెడ, వీపు, నడుముపై గాయాలను గమనించారు. వెంటనే చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు చిన్నారికి పోస్టుమార్టం నిర్వహించారు. శనివారం విడుదల చేసిన పోస్ట్‌మార్టం నివేదికలో చిన్నారి మృతికి కారణం వ్యాధి కాదని, శారీరకంగా దాడి చేయడం వల్ల అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయని తేలింది. ఈ నివేదిక ఆధారంగా హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణంలో భాగంగా మదర్సాలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. చిన్నారి స్నేహితులు, ఇతర విద్యార్థులతో మాట్లాడారు. విచారణ ఆధారంగా, పోలీసులు ముగ్గురు అబ్బాయిలను గుర్తించారు – వారిలో ఇద్దరు 11 ఏళ్లు, ఒకరు 9 ఏళ్ల విద్యార్థిగా గుర్తించారు. పోలీసుల విచారణలో తేలిన దాని బట్టి టీవీలో చూసిన ఓ క్రైమ్ షో వల్లే తమకు సెలవు కావాలంటే దాడి చేయాలనే ఆలోచన వచ్చిందని ఒప్పుకున్నారు. ప్రస్తుతం మదర్సాకు తాళం వేసి పిల్లలందరినీ ఇంటికి పంపించారు. జువైనల్ జస్టిస్ బోర్డు చట్టానికి లోబడి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన చూస్తుంటే పిల్లలపై టీవీలు, సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..