విధి ఆడిన వింత నాటకం.. పెళ్లికి వెళుతుండగా ఊహించని ఘటన.. రెప్పపాటులో ఐదుగురు..
బెంగళూరు నుంచి పెళ్లికి వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన హర్ష్ సతూరితో పాటు నోయిడా, కన్నూర్, కాసరగోడ్, త్రిస్సూర్‌కు చెందిన యువకులు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తుండగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తమిళనాడు కన్నూరు ఎయిర్‌పోర్ట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి పెళ్లికి వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు.. చికిత్స పొందుతూ చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీరంతా బెంగళూరు నుంచి కన్నూరులో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు.. ప్రమాదం జరిగిన సమయంలో పరమ్ చేత్రీ బహదూర్ కారు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. స్థానికుల సహాయంతో లోపల చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు.
మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన హర్ష్ సతూరి..
ఈ ప్రమాదంలో కన్నూరుకు చెందిన షాన్, హైదరాబాద్‌కు చెందిన హర్ష్ సతూరి, నోయిడాకు చెందిన పరమ్ చేత్రీ బహదూర్, కాసరగోడ్ జిల్లాకు చెందిన రిజ్వాన్, త్రిస్సూర్‌కు చెందిన ఆదిత్య కృష్ణదేవ మృతి చెందారని పోలీసులు తెలిపారు.. త్రిస్సూర్‌కు చెందిన ఆదిత్య కృష్ణ తీవ్రంగా గాయపడగా..అతన్ని కన్నూరులోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మరణించాడు..
బెంగళూరులో చదువుకుంటున్న వీరంతా, కన్నూర్‌లోని అలవిల్‌కు చెందిన షాన్ బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు కారులో బయలు దేరారని.. ఈ సమయంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ఘరో ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. కన్నూర్ నుంచి మట్టనూర్ వెళ్లే రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత కారు నుంచి పొగలు వచ్చాయని, నీళ్లు పోసిన తర్వాతే తాము దగ్గరకు చేరుకోగలిగామని స్థానికులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
