AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేహితుడి పెళ్లి కోసం బయలుదేరిన మిత్రులు.. అంతలోనే ఊహించని ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే..

వారంతా ప్రాణ స్నేహితులు.. వారిలో ఒకరి పెళ్లి జరుగుతోంది. దీంతో స్నేహితుడి వివాహ వేడుకకు బయలు దేరారు. ఇంతలోనే ఊహించని ప్రమాదంతో ఐదుగురు స్నేహితులు మృత్యువాతపడ్డారు.

స్నేహితుడి పెళ్లి కోసం బయలుదేరిన మిత్రులు.. అంతలోనే ఊహించని ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే..
Friends
Shaik Madar Saheb
|

Updated on: Jan 23, 2023 | 9:24 AM

Share

వారంతా ప్రాణ స్నేహితులు.. వారిలో ఒకరి పెళ్లి జరుగుతోంది. దీంతో స్నేహితుడి వివాహ వేడుకకు బయలు దేరారు. ఇంతలోనే ఊహించని ప్రమాదంతో ఐదుగురు స్నేహితులు మృత్యువాతపడ్డారు. ఈషాకింగ్ ఘటన కేరళలోని అలప్పుజలో జరిగింది. అలప్పుజలో జాతీయ రహదారిపై కారును ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అంబలపుజాలోని కక్కజోమ్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతులను ప్రసాద్, షిజు దాస్, సచిన్, అమల్, సుమోద్‌లుగా గుర్తించారు. వీరిలో నలుగురు తిరువనంతపురం వాసులు కాగా, ఒకరు కొల్లంకు చెందినవారని పోలీసులు తెలిపారు. మృతులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) క్యాంటీన్‌లో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఆంద్రప్రదేశ్‌కు వెళ్తున్న బియ్యం లోడు లారీ – కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, కారులో ప్రయాణికులంతా ఇరుక్కుపోవడంతో సకాలంలో బయటకు తీయలేకపోయారు. అనంతరం అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కట్టర్ల సహాయంతో కారులోని ప్రయాణికులను బయటకు తీశారు.

కాగా.. ప్రయాణికులు స్నేహితుడి వివాహానికి వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగిందని ఆసుపత్రికి చేరుకున్న బాధితుల బంధువులు వెల్లడించారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..