Fire Accident: ఫర్నీచర్‌ షాప్‌లో అగ్ని ప్రమాదం.. పక్కనే ఉన్న హాస్పిటల్‌కి పొగలు.. పూర్తి వివరాలివే..

ముంబై సరిహద్దు పట్టణమైన థానేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం టైటెన్ ఆసుపత్రికి సమీపంగా ఉన్న ఫర్నిచర్,ప్లైవుడ్ షాపులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఫలితంగా పక్కనే ఉన్న ఆసుపత్రికి కూడా పొగలు వ్యాపించాయి. అయితే ఆసుపత్రిలోని..

Fire Accident: ఫర్నీచర్‌ షాప్‌లో అగ్ని ప్రమాదం.. పక్కనే ఉన్న హాస్పిటల్‌కి పొగలు.. పూర్తి వివరాలివే..
Fire Accident Visuals From Thane
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 05, 2023 | 11:46 AM

ముంబై సరిహద్దు పట్టణమైన థానేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం టైటెన్ ఆసుపత్రికి సమీపంగా ఉన్న ఫర్నిచర్,ప్లైవుడ్ షాపులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఫలితంగా పక్కనే ఉన్న ఆసుపత్రికి కూడా పొగలు వ్యాపించాయి. అయితే ఆసుపత్రిలోని అధికారులు.. రోగులను ముందస్తు జాగ్రత్తగా బయటకు తరలించారు. ఇక సంతోషకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రమాదంలో ఫర్నీచర్, ఫ్లైవుడ్ మెటీరియల్‌కి నష్టం వాటిల్లినట్లు ఉందే తప్ప, ఎవరూ గాయపడలేదు.

కాగా, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణమా..? లేదా మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో అధికారులు ధర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..