Operation Kaveri: ‘ఇంకెవరూ లేరు’.. స్వదేశానికి సురక్షితంగా చేరుకున్న 3800 మంది.. పూర్తి వివరాలివే..

Operation Kaveri: సంక్షోభంలో ఉన్న సూడన్ నుంచి దాదాపు 3800 మంది భారతీయులను విజయవంతంగా స్వదేశానికి తీసుకువచ్చామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ‘సుడాన్‌లో ఉన్న 47 మంది భారతీయులతో కూడిన IAF C-130J విమానం జెడ్డా..

Operation Kaveri: ‘ఇంకెవరూ లేరు’.. స్వదేశానికి సురక్షితంగా చేరుకున్న 3800 మంది.. పూర్తి వివరాలివే..
Evacuees Leaving For Jeddah To India
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 05, 2023 | 11:20 AM

Operation Kaveri: సంక్షోభంలో ఉన్న సూడన్ నుంచి దాదాపు 3800 మంది భారతీయులను విజయవంతంగా స్వదేశానికి తీసుకువచ్చామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ‘సుడాన్‌లో ఉన్న 47 మంది భారతీయులతో కూడిన IAF C-130J విమానం జెడ్డా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. #OperationKaveri ద్వారా దాదాపు 3800 మంది భారతీయులు సూడాన్ నుంచి బయటపడ్డారు’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఖార్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా సూడాన్ పోర్ట్‌లో బయలుదేరడానికి ఇప్పుడు భారతీయులు ఎవరూ వేచిలేరని మేన 4న పేర్కొంది. తన ట్వీట్‌లో ‘అపరేషన్ కావేరి 10వ రోజు కొనసాగుతోంది, ఈ రోజు 192 మంది భారతీయులు, OCI హోల్డర్‌లతో C-17 ఇండియన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ బయలుదేరడంతో సూడాన్ నుంచి 3776 మందిని తరలించినట్లయింది. నేటి ఆపరేషన్‌తో పోర్ట్ సూడాన్‌ నుంచి బయలుదేరడానికి భారతీయులు ఎవరూ లేరు’ అని రాసుకొచ్చింది.

అంతకుముందు, సూడాన్‌లో చిక్కుకుపోయిన 192 మంది భారతీయులు గురువారం అహ్మదాబాద్‌లో దిగారు. పోర్ట్ సూడాన్ నుంచి అహ్మదాబాద్‌కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ17 విమానంలో గుజరాత్‌కు తీసుకొచ్చారు. అదే రోజు, ‘20 మంది నిర్వాసితులు 2 బ్యాచ్‌లలో చెన్నైకి ఇద్దరు, బెంగళూరుకు 18 మంది బయలుదేరార’ని బాగ్చి ట్వీట్ చేశారు. సుడాన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం గురువారం నాటికి అంటే ఆపరేషన్ కావేరి కొనసాగిన తొమ్మిది రోజులలో మొత్తం 3,584 మంది భారతీయులను సుడాన్ నుంచి తరలించారు.

కాగా, సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణల ఫలితంగా సూడాన్ రక్తపాతాన్ని చవిచూస్తోంది. ఇలా అంతర్గత సంఘర్షణలోని సూడాన్‌ నుంచి భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక రెస్క్యూ మిషన్ ‘ఆపరేషన్ కావేరి’ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాడి సయ్యిద్నా మిలిటరీ ఎయిర్‌బేస్‌తో సహా 5 ఇండియన్ నేవల్ షిప్‌లు, 16 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఈ ఆపరేషన్‌లో పనిచేస్తున్నాయి.