విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నోయిడాలోని ఓ విద్యుత్ సబ్ స్టేషన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నోయిడా పవర్ కంపెనీ లిమిటెడ్‌లోని సెక్టార్ 148లో ఈ సంఘటన..

  • Tv9 Telugu
  • Publish Date - 3:30 pm, Wed, 19 August 20
విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నోయిడాలోని ఓ విద్యుత్ సబ్ స్టేషన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నోయిడా పవర్ కంపెనీ లిమిటెడ్‌లోని సెక్టార్ 148లో ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు.