డాక్టర్లపై దాడులు చేసేవారిపై ఇక కఠిన చర్యలు…..రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచన

డాక్టర్లపైనా, హెల్త్ కేర్ వర్కర్లపైనా దాడులు చేసేవారిపై ఎఫ్ ఐ ఆర్ కేసులు నమోదు చేయాలని, ఎపిడెమిక్ డిసీజెస్ (ఎమెండ్ మెంట్) యాక్ట్-2020 కింద కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం..

డాక్టర్లపై దాడులు  చేసేవారిపై  ఇక కఠిన చర్యలు.....రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచన
Fir On Those Who Attacks On
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 19, 2021 | 9:43 PM

డాక్టర్లపైనా, హెల్త్ కేర్ వర్కర్లపైనా దాడులు చేసేవారిపై ఎఫ్ ఐ ఆర్ కేసులు నమోదు చేయాలని, ఎపిడెమిక్ డిసీజెస్ (ఎమెండ్ మెంట్) యాక్ట్-2020 కింద కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం..రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. దేశవ్యాప్తంగా కోవిద్ రోగులకు చికిత్సలు చేస్తున్న వైద్య బృందాలపై తరచూ దాడులు జరుగుతున్న ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. ఇక వీటిని సహించరాదని నిర్ణయించింది. కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా… ఈ మేరకు వీటికి లేఖలు రాస్తూ.. వైద్య బృందాలపై దాడులు జరిగితే వారి మనో స్థయిర్యం దెబ్బ తినవచ్చునని, వారిలో అభద్రతా భావం పెరిగిపోతుందని తన లేఖలో పేర్కొన్నారు., ఇది ఒక రకంగా హెల్త్ కేర్ సిస్టం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

దాడులకు పాల్పడేవారిపై ఎఫ్ ఐ ఆర్ కేసులు నమోదయ్యేలా చూడాలని, ఇది ఫాస్ట్ ట్రాక్ లో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.కాగా- ఎటాకర్లకు అయిదేళ్ల జైలు శిక్ష, రెండు లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. వారి దాడిలో డాక్టర్లు లేదా హెల్త్ కేర్ వర్కర్లు తీవ్రంగా గాయపడిన పక్షంలో..ఎటాకర్లకు ఏడేళ్ళజైలు శిక్ష, 5 లక్షల ఫైన్ కూడా విధిస్తారు.

ఈ నేరాలను నాన్-బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. పైగా ఈ విధమైన దాడుల పరిస్థితిని గోరంతలు..కొండంతలుగా చేసే సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఇటీవల అస్సాంలో ఓ డాక్టర్ పై జరిగిన దాడితో బాటు ఈ విధమైన ఘటనల పట్ల హోమ్ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Tollywood: తెలుగు సినిమాల్లో స‌రికొత్త‌ ట్రెండ్ సృష్టించిన స్టార్స్ వీరే .. ( వీడియో )

ఘోర రోడ్డు ప్రమాదం చనిపోయిన తన తల్లికి, చెల్లికి అంత్యక్రియలు చేసిన యువ వైద్యురాలు.. ( వీడియో)