Nirmala Sitharaman: కోలుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (డిసెంబర్ 29) రాత్రి ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైరల్ ఫీవర్ లక్షణాల కారణంగా సీతారామన్ సోమవారం (డిసెంబర్ 26) ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు.
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (డిసెంబర్ 29) రాత్రి ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైరల్ ఫీవర్ లక్షణాల కారణంగా సీతారామన్ సోమవారం (డిసెంబర్ 26) ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. సోమవారం ఆమెను ఎయిమ్స్‌లోని ప్రైవేట్ వార్డులో చేర్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోలుకుంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
2023లో బడ్జెట్..
2023 సంవత్సరంలో బడ్జెట్‌ను సమర్పించాల్సి ఉంది. దీనికి సంబంధించి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం ఉపశమనం కలిగించే విషయం.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (డిసెంబర్ 25) ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’లో మాజీ ప్రధాని అటల్ విహారీ లజ్‌పేయి జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు ఆమె శనివారం చెన్నైలోని తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ 35వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళనాడులో వైద్య విద్యను తమిళ భాషలోనే బోధించాలని అన్నారు.
2020 బడ్జెట్ ప్రసంగం సమయంలోనూ క్షీణించిన ఆరోగ్యం..
సీతారామన్ ఆరోగ్యం క్షీణించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2020 న మోడీ ప్రభుత్వం రెండవసారి రెండవ బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చాలా ఎక్కువ సేపు ఉంటుంది. అనారోగ్యం కారణంగా ఆమె తన ప్రసంగాన్ని పూర్తిగా చదవలేకపోయింది. పార్లమెంట్‌లో దాదాపు మూడున్నర గంటలపాటు (160 నిమిషాలు) నిరంతరాయంగా ప్రసంగించిన ఆమె ఆరోగ్యం కాస్త క్షీణించడంతో బడ్జెట్ ప్రసంగం మొత్తం చదవలేకపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..