Bharat Bandh Highlights: దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతం.. తెలుగు రాష్ట్రాల్లోనే అదే సీన్..

Venkata Narayana

| Edited By: Ravi Kiran

Updated on: Sep 27, 2021 | 5:56 PM

Farmers Protest Highlights: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సంయుక్త కిసాన్‌ మోర్చా

Bharat Bandh Highlights: దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతం.. తెలుగు రాష్ట్రాల్లోనే అదే సీన్..
Kerala Bundh

Farmers Protest Highlights: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఇవాళ (సోమవారం) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి (సెప్టెంబర్‌ 27) ఏడాదైన సందర్భంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. ఈ బంద్‌కు దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ జరగనుంది.

రైతులు ప్రకటించిన బంద్‌కు కాంగ్రెస్ సహా వామపక్షాలు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. బంద్‌కు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడెరేషన్‌ కూడా మద్దతు తెలిపింది. బంద్‌ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Sep 2021 05:54 PM (IST)

    తెలంగాణలో బంద్ ప్రశాంతం..

    తెలంగాణలో మాత్రం బంద్ పాక్షికంగా కొనసాగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం బంద్ లో పాల్గొనలేదు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌, కూకట్‌పల్లి డిపోల ముందు పలువురు నాయకులు ఆందోళన చేపట్టారు. నల్గొండలో వామపక్షాలు ధర్నా చేపట్టాయి. సూర్యాపేట జిల్లా కోదాడలోనూ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కు భారత్‌ బంద్‌ సెగ తగిలింది. జనగామ జిల్లాలో దేవరుప్పుల చౌరస్తాలో భారత్ బంద్ నిర్వహిస్తున్న సమయంలో మహబూబాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారును అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. మేడ్చల్ లో భారత్ బంద్ కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. రాస్తా రోఖో నిర్వహిస్తున్న అఖిల పక్ష నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

  • 27 Sep 2021 05:53 PM (IST)

    ఏపీలో బంద్ ప్రశాంతం..

    ఏపీలో దాదాపుగా బస్సులన్నీ డిపోలకే పరిమతమయ్యాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు. విశాఖ పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లోనూ బంద్ ప్రభావం కనబడింది. ఆందోళకారులు వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తిరుపతిలో బంద్‌ కొద్దిపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అమరావతిలో వర్షం పడుతున్నా సీపీఐ, సీపీఎం నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.

  • 27 Sep 2021 05:53 PM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రశాంతం..

    తెలుగు రాష్ట్రాల్లో.. భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా అన్ని బీజేపీయేతర రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి.

  • 27 Sep 2021 05:52 PM (IST)

    14 జిల్లాలకు రెడ్ అలర్ట్!

    గులాబ్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై భారీగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని 14 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జోన్‌లో ఉన్నట్లు పేర్కొంది. అటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

  • 27 Sep 2021 04:59 PM (IST)

    ప్రభుత్వంతో చర్చలకు సిద్దం..

    మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైందని భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ టికయాట్ తెలిపారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు తప్పితే.. అన్ని చోట్లా ప్రశాంతంగా నిరసనలు కొనసాగాయన్నారు. చర్చలకు ప్రభుత్వం ఆహ్వానిస్తే.. తాము సిద్దమేనని స్పష్టం చేశారు.

  • 27 Sep 2021 03:26 PM (IST)

    తమిళనాడు: బారికేడ్లను పగలగొట్టిన రైతులు.. రంగంలోకి పోలీసులు..

    మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ నేపధ్యంలో తమిళనాడు నిర్మానుష్యంగా మారింది. అయితే చెన్నైలోని అన్నాసలై ప్రాంతంలో పోలీసు బారికేడ్లను రైతులు పగలగొట్టడంతో.. పరిస్థితి చెయ్యి దాటింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

  • 27 Sep 2021 01:11 PM (IST)

    రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరసనలు

    భారత్ బంద్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. మైలార్ దేవ్ పల్లి డివిజన్లో భారత్ బంద్ కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ కార్యదర్శి సానం శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జలపల్లి నరేందర్, రంగారెడ్డి జిల్లా ఐ ఎన్ టి యు సి మైలార్ దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఎన్ ధనుంజయ, ఏఐటియుసి కార్యదర్శి జిల్లా వనం పల్లి జైపాల్ రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షులు గుర్రం శంకర్.. బొల్లం వెంకటేష్ సుధాకర్.. రవీందర్ రెడ్డి.. నాగరాజ్.. అంజి జాఫర్ శ్రీశైలం నిహాల్.. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

  • 27 Sep 2021 12:53 PM (IST)

    మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అరెస్ట్.. స్టేషన్‌కు తరలింపు

    > భారత్ బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. ఆయా పార్టీల నేతలు > ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు > సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ, వామ పక్ష పార్టీల నేతలు > భారత్ బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఆయా పార్టీల నేతలు > ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

  • 27 Sep 2021 12:24 PM (IST)

    గుర్రపు బండ్లను అసెంబ్లీలోకి అనుమతించమన్న పోలీసులు..

    హైదరాబాద్ సిటీ రోడ్ల మీద గుర్రపు బండ్లపై తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపు బండ్లను లోపలికి అనుమతించమని తేల్చిచెప్పారు. అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు నారాయణగూడ పీఎస్​కు తరలించారు. పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి.. ప్రజలపై భారం పడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మండిపడ్డారు.

  • 27 Sep 2021 12:18 PM (IST)

    కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం: CLP నేత భట్టి

    బీజేపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు CLP నేత భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశానికి కాంగ్రెస్ నేతలు గుర్రపు బండ్లపై వెళ్లారు. గాంధీభవన్​నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుర్రపు బండ్లపై వెళ్లి కేంద్ర విధానాలపై నిరసన తెలిపారు. హస్తం నేతల ఈ తీరుతో.. రహదారిపై రద్దీ ఏర్పడింది. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు.

  • 27 Sep 2021 12:14 PM (IST)

    గుర్రపు బండిపై రాకూడదని అసెంబ్లీ రూల్స్‌లో ఉందా.?: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

    భారత్‌ బంద్‌కు మద్దతుగా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుర్రపు బండిపై అసెంబ్లీకి రావడం టెన్షన్‌ను క్రియేట్‌ చేసింది. గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ సభ్యులు గుర్రపు బండిపై వచ్చారు. వారిని అసెంబ్లీ బయటే ఆపేశారు పోలీసులు. దీంతో అక్కడే రోడ్డుపై బైటాయించారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలోకి కార్లలో మాత్రమే రావాలని ఉందా? గుర్రపు బండిపై రాకూడదని అసెంబ్లీ రూల్స్‌లో ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు.

  • 27 Sep 2021 12:09 PM (IST)

    కేంద్రం నిర్ణయాలు వ్యతిరేకించేందుకు తెలంగాణ సర్కారు భయపడుతోంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

    కేంద్ర, రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిర్ణయాలు వ్యతిరేకించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.

    T Congress

    T Congress

  • 27 Sep 2021 12:07 PM (IST)

    టీఆర్ఎస్ నిర్ణయం అసెంబ్లీలో చెప్పాలి: ఎమ్మెల్యే సీతక్క

    కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన నూతన సాగు చట్టాలపై టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏంటో ఈ అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. కేంద్ర సర్కార్ విధానాలతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని.. సాగును ప్రైవేట్​వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని సీతక్క ఆరోపించారు.

  • 27 Sep 2021 11:54 AM (IST)

    తమిళనాడులోనూ ముమ్మరంగా భారత్ బంద్.. చెన్నైలోని అన్నా సలై ప్రాంతంలో ఉద్రిక్తత

    తమిళనాడులోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ రోజు రైతు సంస్థలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతుగా చెన్నైలోని అన్నా సలై ప్రాంతంలో పోలీసు బారికేడ్‌ను నిరసనకారులు తొలగించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • 27 Sep 2021 11:39 AM (IST)

    అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలిగించం: రాకేశ్​టికాయిత్

    భారత్ బంద్ నేపథ్యంలో అంబులెన్సులు, డాక్టర్లు సహా అత్యవసర సేవలకు మేము ఎలాంటి అంతరాయం కలిగించమని భారత్​ కిసాన్​ యూనియన్​నేత రాకేశ్​టికాయిత్ స్పష్టం చేశారు. కేవలం కేంద్రానికి సందేశం ఇవ్వడం కోసమే ఈ బంద్​ చేపట్టామని ఆయన వివరణ ఇచ్చారు. దుకాణాదారులు సాయంత్రం 4 వరకు షాపులు మూసి ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ చర్చలకు మరోసారి సిద్ధమని కేంద్రం చెప్తున్నా అది కేవలం టీవీలకే పరిమితమైందన్న ఆయన.. మమ్మల్ని నేరుగా ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు.

  • 27 Sep 2021 11:36 AM (IST)

    భారత్ బంద్ అందుకే: రాకేశ్​టికాయిత్

    కేంద్రంతో ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో సాగు చట్టాల ప్రస్తావన తీసుకురాలేదన్నారు భారత్​ కిసాన్​ యూనియన్​నేత రాకేశ్​టికాయిత్. అవి తప్ప ఇతర ఏ సమస్యల గురించి అయినా చర్చించాలని కేంద్రం పేర్కొందని.. అలాంటప్పుడు చర్చల వల్ల ఫలితం లేదని భావించే ఈ భారత్ బంద్ చేపట్టామని ఆయన తెలిపారు.

  • 27 Sep 2021 11:32 AM (IST)

    కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు రాహుల్ గాంధీ పిలుపు

    భారత్​ బంద్​కు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మద్దతు తెలిపారు. రైతు సంఘాలు ప్రకటించిన భారత్​ బంద్‌కు మద్దతివ్వాలని నిలవాలని ఆయన కాంగ్రెస్​పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతులు శాంతియుతంగా చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే వారు ఈ విధంగా బంద్​ చేపట్టినట్లు రాహుల్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

  • 27 Sep 2021 11:30 AM (IST)

    కర్ణాటకలో భారత్ బంద్

    కర్ణాటకలోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. కలబురిగిలో బస్​స్టాండ్​ ఎదుట పలు సంస్థలు రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి.

  • 27 Sep 2021 11:24 AM (IST)

    ఏపీలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం.. జనం అవస్థలు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత్ బంద్ కు సంఘీభావం తెలియజేయడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమిత అయ్యాయి. దీంతో ఏపీలోని అన్ని జిల్లాల్లో బస్టాండులు నిర్మాణుషంగా మారిపోయాయి. మరోవైపు, బంద్ గురించి అవగాహనలేని పలువురు సామాన్యజనం మాత్రం బస్టాండుల్లో పడిగాపులు కాస్తూ, ఏమీ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

  • 27 Sep 2021 11:21 AM (IST)

    భారత్‌ బంద్‌ నిరసనలో భాగంగా గుర్రం బండి బగ్గీపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

    > భారత్‌ బంద్‌ నిరసనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుర్రం బండి బగ్గీపై అసెంబ్లీకి వచ్చారు. పెట్రో ధరల పెంపుపై తమ నిరసన తెలిపారు.

  • 27 Sep 2021 11:19 AM (IST)

    ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కు భారత్‌ బంద్‌ సెగ

    టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కు భారత్‌ బంద్‌ సెగ తగిలింది. జనగామ జిల్లాలో దేవరుప్పుల చౌరస్తాలో భారత్ బంద్ నిర్వహిస్తున్న సమయంలో మహబూబాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారును అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు.

  • 27 Sep 2021 11:00 AM (IST)

    శ్రీకాకుళంలో జోరు వర్షాన్ని సైతం లెక్క చేయని నిరసనకారులు

    నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వామ పక్షాలు ఇచ్చిన భారత్ బంద్ శ్రీకాకుళం జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే వామపక్ష పార్టీల నేతలు, వారికి మద్దతు ఇచ్చే అఖిల పక్ష పార్టీల నేతలు జోరు వర్షంలో కూడా ర్యాలీలు నిర్వహించి బంద్ ను సక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుండపోత వర్షంలో కూడా రోడ్ల పైకి వచ్చి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. మరో వైపు ఈ బంద్ కోసం విస్తృతంగా ప్రచారం జరగడంతో ప్రజలు స్వచ్చందంగా సహకరిస్తున్నారు.

  • 27 Sep 2021 10:51 AM (IST)

    భారత్‌ బంద్ ఎఫెక్ట్ ఎలా ఉందో చెప్పడానికి ఈ విజువల్ ఒక ఉదాహరణ

    > భారత్‌ బంద్ ఎఫెక్ట్ ఎలా ఉందో చెప్పడానికి గుర్‌గావ్‌ – ఢిల్లీ హైవేపై దృశ్యాలే పెద్ద ఎగ్జాంపుల్ > వేలాది వాహనాలు రోడ్డుపై ఇలా ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి > సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌తో ఢిల్లీ నలుదిక్కులా బంద్‌ పాటిస్తున్నాయి ఆయా పార్టీలు > బందే కదా.. ఏం చేస్తారులే అనుకున్నారో ఏమో, రోడ్లపైకి యథావిథిగా వచ్చారు వాహనదారులు > తీరా వచ్చాక.. రోడ్డుపై పరిస్థితి ఇది. టీవీ9లో మాత్రమే ప్రస్తుతం ఈ దృశ్యం మీరు ఎక్స్‌క్లూజివ్‌గా చూస్తున్నారు

  • 27 Sep 2021 10:29 AM (IST)

    కోనసీమలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు, ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు

    > తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రశాంతంగా భారత్ బంద్ > భారత్ బంద్ కు పిలుపు నిచ్చిన అఖిల పక్షాలు, రైతు, ప్రజా సంఘాలు > పాఠశాలలకు సెలవు ప్రకటించిన విద్య శాఖ అధికారులు.. > డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు > రైతు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ > కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ > ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలు ఆగ్రహం > భారత్ బంద్ సంఘీభావం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం > భారత్ బంద్‌కు రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యా, కార్మిక సంఘాల మద్దతు

  • 27 Sep 2021 10:03 AM (IST)

    వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ నుండి శివయ్య స్తూపం, ప్రధాన రహదారుల్లో మోటర్ సైకిల్ ర్యాలీ

    > గుంటూరు జిల్లా వినుకొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది > రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నిరసనకారుల నినాదాలు. > పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పై పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ > ఆర్టీసీ బస్టాండ్ నుండి శివయ్య స్తూపం, ప్రధాన రహదారుల్లో మోటర్ సైకిల్ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు

  • 27 Sep 2021 09:47 AM (IST)

    హర్యానా రాష్ట్రంలో జోరుగా భారత్ బంద్.. అంబాలా- నాహాన్ రహదారి బ్లాక్

    హర్యానా రాష్ట్రంలో జోరుగా భారత్ బంద్ కొనసాగుతోంది. అంబాలా – నాహాన్ రహదారిని పంజోఖ్రా గ్రామం దగ్గర బ్లాక్ చేశారు నిరసనకారులు. దీంతో సదరు రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిపోయే పరిస్థితి నెలకొంది.

    Haryana

    Haryana Bundh

    Haryana 2

    Haryana Bundh

  • 27 Sep 2021 09:41 AM (IST)

    తెలంగాణలో అంతగా కనిపించని భారత్ బంద్ ప్రభావం.. పూర్తిస్థాయిలో ఆర్టీసీ సర్వీసులు

    > తెలంగాణ ఆర్టీసీలో అసలు కనిపించని భారత్ బంద్ ప్రభావం > హైదరాబాద్ MGBS నుండి తెలంగాణ జిల్లాలకు సంపూర్ణంగా నడుస్తోన్న బస్‌లు > ఏపీ కి వెళ్ళే బస్‌లు మాత్రం మధ్యాహ్నంకి ఏపీ బోర్డార్ చేరేలా నడుస్తున్న బస్‌లు

  • 27 Sep 2021 09:31 AM (IST)

    పశ్చిమ బెంగాల్ లో భారత బంద్ దృశ్యాలు

    > వెస్ట్ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో భారత్ బంద్ కొనసాగుతోంది. ఆందోళనకారులు బ్యానర్లు పట్టుకొని రోడ్లమీదకొచ్చి నిరసన తెలుపుతున్నారు.

    West Bengal

    West Bengal

  • 27 Sep 2021 09:19 AM (IST)

    విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణీకుల అవస్థలు.. గంటల తరబడి పడిగాపులు

    బంద్, తుఫాను నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని 30 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 18 ట్రైన్స్ ను దారి మళ్లించారు. ప్రయాణికులకు సమాచారం కోసం వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, రాయఘడ రైల్వే స్టేషన్లలో హెల్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. రైళ్లు రద్దు అవ్వటంతో సమాచారం తెలియక పలువురు ప్రయాణికులు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకొని అవస్థలు పడుతున్నారు. రైళ్లు రద్దు అవ్వటంతో ఎటు వెళ్ళాలో తెలియక రైల్వే స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు.

  • 27 Sep 2021 09:13 AM (IST)

    బంద్‌లో పంజాబీ యూనివర్సిటీ విద్యార్థులు

    > పంజాబీ యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు భారత్ బంద్ పాటిస్తున్నారు > భారత్ బంద్ నేపథ్యంలో యూనివర్సిటీ మై గేట్ మూసివేశారు

    Punjab

    #BharathBandh

  • 27 Sep 2021 09:08 AM (IST)

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. జోరు వానను సైతం లెక్కచేయకుండా..

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం పిలుపు ఆధ్వర్యంలో భారత్ బంద్ జోరుగా నిర్వహిస్తున్నారు. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అఖిలపక్ష నేతలు బందులో పాల్గొంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు సైతం స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి, మధిర ఆర్టీసీ డిపో, బస్టాండ్ల ముందు అఖిలపక్షం నేతలు ఆందోళన నిర్వహించారు. ఛత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్ వెళ్లే బస్సులు నిలిపివేశారు. జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నల్ల చట్టాలను వెంటనే విరమించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

  • 27 Sep 2021 08:48 AM (IST)

    ఢిల్లీ పోలీసులు అప్రమత్తం.. ఇండియా గేట్‌, ముఖ్య ప్రాంతాల్లో అదనపు బలగాలు

    > దేశ రాజధాని హస్తినలో భారత్ బంద్ > బంద్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు > వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ > బంద్‌కు వీలు కల్పిస్తూ కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటన > నూతన సాగు చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్‌తో నిరసనలు. > దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న నిరసనలు. > రాజకీయాలకతీతంగా ప్రజలు పాల్గొనాలని సంయుక్త కిసాన్‌ మోర్చా విజ్ఞప్తి. > బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు. > రైతులతో కలిసి బంద్‌లో పాల్గొంటామని కాంగ్రెస్‌, ఆప్‌, ఎస్పీ, బీఎస్పీ ప్రకటన. > రైతుల ఆందోళన దృష్ట్యా ఢిల్లీ పోలీసులు అప్రమత్తం. > ఇండియా గేట్‌, ముఖ్య ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు. > నిరసన శిబిరాల నుంచి ఢిల్లీలోకి ఎవరూ రాకుండా పోలీసుల చర్యలు

    Bharath Bundh2

    #BharathBandh

  • 27 Sep 2021 08:24 AM (IST)

    విజయవాడలో జోరును వానలో కూడా రోడ్డు పైకి వచ్చిన వామపక్షాలు, కార్మిక సంఘాలు, టీడీపీ, వైసీపీ నాయకులు

    > విజయవాడలో ముమ్మరంగా భారత్ బంద్ > జోరును వానలో కూడా రోడ్డు పైకి వచ్చిన వామపక్షాలు, కార్మిక సంఘాలు, టీడీపీ, వైసీపీ నాయకులు > బీజేపీ, జనసేన బంద్‌కు దూరం > రైతు సంఘాలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల పిలుపు మేరకు విజయవాడలో భారత్ బంద్ > బంద్‌ను విజయవంతం చేసేందుకు సర్వం సిద్ధం > భారత్ బంద్ కు కమ్యూనిస్టు పార్టీలతో పాటు రైతు సంఘాలు ఉదయాన్నే కార్యాచరణ > బంద్ కు మద్దతుగా మధ్యాహ్నం వరకూ ఎక్కడి బస్సులు అక్కడే అని ప్రకటించిన రవాణా శాఖ > భారత్ బంద్ కు వైసీపీ సర్కార్ తో పాటు విపక్ష టీడీపీ మద్దతు

  • 27 Sep 2021 08:19 AM (IST)

    కర్నూలు: బంద్ నేపథ్యంలో ‘కర్నూలు – బళ్లారి’ ప్రధాన రహదారిపై భారీగా నిలచిన వాహనాలు

    > ఆలూరు అంబేద్కర్ సెంటర్ లో కొనసాగుతున్న భారత్ బంద్ > కర్నూలు – బళ్లారి ప్రధాన రహదారిపై భారీగా నిలచిన వాహనాలు > బంద్ లో పాల్గొన్న TDP, వామపక్ష పార్టీలు

  • 27 Sep 2021 08:16 AM (IST)

    హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌‌లో అఖిలపక్షం, మిత్రపక్షాల ఆధ్వర్యంలో నిరసన

    > భారత్ బంద్ లో భాగంగా అఖిలపక్షం, మిత్రపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో నిరసన కార్యక్రమం

    > జీడిమెట్ల బస్ డిపో వద్ద బస్సులను బైటకు రాకుండా గేటు వద్ద అడ్డుకున్న మిత్రపక్షాల నాయకులు

    > జీడిమెట్ల బస్ డిపోకే పరిమితమైన టీఎస్ఆర్టీసీ బస్సులు

  • 27 Sep 2021 07:53 AM (IST)

    ఉమ్మడి మెదక్ జిల్లాలో పాక్షికంగా కొనసాగుతున్న భారత్ బంద్

    > మెదక్ బస్ డిపో ముందు అఖిల పక్షం ఆధ్వర్యంలో బస్సులు కదలకుండ బైఠయించినా నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు > గజ్వేల్ నియోజకవర్గం భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ప్రజ్ఞాపూర్ డిపో ముందు బస్సులు వెళ్లకుండా ఆందోళన చేపట్టిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరసారెడ్డి.. కాంగ్రెస్ శ్రేణులు.

  • 27 Sep 2021 07:36 AM (IST)

    వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపో ముందు నిరసనలు

    > నేటి భారత్ బంద్ పిలుపు మేరకు తాండూర్ ఆర్టీసీ డిపో ముందు నిరసన తెలుపుతూ బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్న అఖిలపక్ష నేతలు > దీంతో అక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు > భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి

  • 27 Sep 2021 07:26 AM (IST)

    భారత్‌ బంద్‌కు వైసీపీ ప్రభుత్వం, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు.. టీఆర్ఎస్, జనసేన దూరం

    నేడు తెలుగు రాష్ట్రాల్లో భారత్‌ బంద్‌ కార్యకలాపాలు > వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బంద్ > సా.4గంటల వరకు శాంతియుత బంద్‌కు పిలుపునిచ్చిన కిసాన్‌ సంయుక్త మోర్చా > భారత్‌ బంద్‌కు వైసీపీ ప్రభుత్వం మద్దతు > బంద్‌కు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు > బంద్‌కు మద్దతు తెలపని టీఆర్ఎస్, జనసేన

  • 27 Sep 2021 07:23 AM (IST)

    ఏపీలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ

    భారత్‌ బంద్‌కు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్‌ తెలిపారు. ఈ సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  • 27 Sep 2021 07:21 AM (IST)

    యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ముందు కాంగ్రెస్, సీపీఐ నాయకుల ఆందోళన

    > యాదాద్రి జిల్లాలో భారత్ బంద్ > భారత్ బంద్ లో భాగంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ముందు కాంగ్రెస్, సీపీఐ నాయకుల ఆందోళన > కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని విపక్ష నేతల డిమాండ్‌

  • 27 Sep 2021 07:16 AM (IST)

    సూర్యాపేట ఆర్టీసీ బస్ డిపో ముందు అఖిల పక్ష నేతల బైఠాయింపు

    > భారత్ బంద్ నేపథ్యంలో సూర్యాపేట ఆర్టీసీ బస్ డిపో ముందు అఖిల పక్ష నేతలు బైఠాయించారు. > ఆర్టీసీ బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు.. దీంతో బస్ సర్వీసులు నిలిచి పోయాయి

  • 27 Sep 2021 07:11 AM (IST)

    తెలంగాణ నుండి ఏపీకి వెళ్లే బస్సులు నిలిపివేత, యధావిధిగా నడవనున్న తెలంగాణ జిల్లాల బస్సులు

    > తెలంగాణ వ్యాప్తంగా మరికాసేపట్లో రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించిన వామపక్ష, కార్మిక రైతు సంఘాల నేతలు > తెల్లవారుజాము నుంచే రోడ్డు పైకి వచ్చిన సీపీఎం, రైతు, కార్మిక సంఘాల నేతలు > మూతపడ్డ ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు > డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు >మధ్యాహ్నం 12 తర్వాత నడపనున్న టీఎస్ ఆర్టీసీ.. ఏపీలో మధ్యాహ్నం 12 వరకు బంద్ కు మద్దతు తెలిపిన కారణంగా తెలంగాణ నుండి వెళ్లే ఆంధ్ర బస్సులు బంద్ > యధావిధిగా నడవనున్న తెలంగాణ జిల్లాల బస్సులు

  • 27 Sep 2021 07:05 AM (IST)

    అనంతపురం జిల్లాలో ప్రారంభమైన భారత్ బంద్

    > తెల్లవారుజాము నుంచే రోడ్డు పైకి వచ్చిన సీపీఎం, రైతు, కార్మిక సంఘాల నేతలు

    > మూతపడ్డ ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు

    > డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

  • 27 Sep 2021 06:54 AM (IST)

    హన్మకొండ బస్‌ డిపో ముందు జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా

    దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ ప్రారంభమైంది. ఉదయం ఐదు గంటల నుంచి అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. హన్మకొండ బస్‌ డిపో ముందు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.

  • 27 Sep 2021 06:52 AM (IST)

    ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయి బంద్, స్థంభించిన ఒంగోలు

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. రైతు, కార్మిక, ప్రజా సంఘాలు, వామపక్షాలు, పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారత్‌ బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒంగోలు నగరంతోపాటు, అన్ని మండల కేంద్రాల్లో ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించారు. బంద్‌ నేపథ్యంలో ఒంగోలుతో పాటు, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఉదయం పూట బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

  • 27 Sep 2021 06:46 AM (IST)

    పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ వాయిదా

    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ వార్డు సభ్యులకు నేటి (సోమవారం) నుంచి జరగాల్సిన శిక్షణ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర తుపాను ప్రభావం, భారత్‌ బంద్‌ నేపథ్యంలో 2 రోజులు వాయిదా వేసినట్టు ఏపీ ఎస్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జె.మురళి తెలిపారు. ఈనెల 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.

  • 27 Sep 2021 06:44 AM (IST)

    భారత్ బంద్‌ ఎందుకు చేస్తున్నారంటే..

    > కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ 10 నెలలుగా సాగుతున్న పోరాటానికి మద్దతుతోపాటు ఆ చట్టాల రద్దు కోసం, కోట్లాదిమంది కార్మికుల ప్రయోజనాలను కాలరాసేలా తీసుకువచ్చిన లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా కోరుతోంది.

    > ప్రతి పంటకు కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్ని పెంచాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తోంది.

  • 27 Sep 2021 06:42 AM (IST)

    ఏపీలో నిలిచిపోయిన ఆటోలు

    భారత్ బంద్ నేపథ్యంలో లారీలు, ఆటోలను తిప్పబోమని ఏపీలోని పలు సంస్థలు ప్రకటించాయి. రవాణా పూర్తిగా స్తంభించనున్నందున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ఎస్‌.కె.ఎం. బాధ్యులు వై.కేశవరావు, రావుల వెంకయ్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ బంద్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు.

  • 27 Sep 2021 06:40 AM (IST)

    ఏపీపీజీఈసెట్‌ పరీక్షలు వాయిదా

    భారత్‌ బంద్‌ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ఏపీపీజీఈసెట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సెట్‌ చైర్మన్, కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ, కంప్యూటర్‌ సైన్సు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేశామని, ఇదే సెట్‌కు సంబంధించి మంగళ, బుధవారాల్లో జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వివరించారు.

  • 27 Sep 2021 06:39 AM (IST)

    విద్యా సంస్థల మూత.. పలు పరీక్షలు, శిక్షణా తరగతులు వాయిదా

    భారత్‌ బంద్‌కు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్‌ తెలిపారు. ఈ సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్స్‌ పరీక్షలకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు సోమవారం జరగాల్సిన ఎంపిక పరీక్షను బంద్‌ కారణంగా వాయిదా వేసినట్టు ఏపీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు ఉసురుపాటి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

  • 27 Sep 2021 06:36 AM (IST)

    ప్రజలంతా సహకరించాలని సంయుక్త ఏపీ కిసాన్‌ మోర్చా వినతి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత్ బంద్ కు పూర్తి సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌.కె.ఎం.) ప్రకటించింది. బంద్‌కు అధికార వైఎస్సార్‌సీపీ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బంద్‌లో పాల్గొంటున్నట్టు తెలిపాయి. బంద్‌కు సహకరిస్తామని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను నిలిపేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

  • 27 Sep 2021 06:26 AM (IST)

    ఏపీలో మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేత

    కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఇవాళ తలపెట్టిన భారత్‌ బంద్‌ నేపథ్యంలో ఏపీలో మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సులు సేవలు నిలిపివేశాయి. విద్య, వాణిజ్య, వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. సినిమా హాళ్లలో ఉదయం పూట ఆటలు రద్దుచేస్తున్నట్టు సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే నోటీసు బోర్డులు పెట్టాయి.

Published On - Sep 27,2021 6:22 AM

Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే