PM Kusum: రైతులకు మరో గొప్ప అవకాశం.. వ్యవసాయ క్షేత్రంలోనే బిజినెస్.. ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం..
రైతును రాజును చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద పథకంను తీసుకొచ్చింది. దీంతో తన వ్యవసాయ క్షేతంలో పంటలుపండించుకుంటూ కొంత స్థలంను అద్దెకు ఇవ్వవచ్చు. ఇలా లక్షల రూపాయలను అదనంగా సంపాధించుకునే అవకాశం ఉంది.
రైతును రాజును చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద పథకంను తీసుకొచ్చింది. దీంతో తన వ్యవసాయ క్షేతంలో పంటలుపండించుకుంటూ కొంత స్థలంను అద్దెకు ఇవ్వవచ్చు. ఇలా లక్షల రూపాయలను అదనంగా సంపాధించుకునే అవకాశం ఉంది. స్వయం ఉపాధి కోసం ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో పీఎం కుసుం యోజన(PM Kusum Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా సోలార్ ప్యానెల్స్‌తో ఆర్ధిక ప్రగతిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకంను తీసుకొచ్చింది. దీనితో పాటు ఇది ప్రజలకు ఆదాయ వనరుగా కూడా మారుతుంది.
కరోనా కష్ట కాలంలో చాలా మంది ఉద్యోగ కోసం పోరాటం చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో శాశ్వత సంపాదన ఎంపికపై దృష్టి పెట్టారు. వారికి పీఎం కుసుమ్ యోజన సహాయకారిగా మారిందని చెప్పవచ్చు. ఇందులో మీరు సోలార్ ప్యానెల్స్ తయారు చేయడం ద్వారా ప్రతి నెలా లక్షలు సంపాదించవచ్చు. మంచి విషయం ఏమిటంటే.. ఈ పథకం కింద సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మీకు పెద్ద ఆఫర్ కూడా ఇస్తుంది.
కుసుమ్ యోజన ద్వారా మీరు ఇంటి పైకప్పు లేదా ఖాళీ స్థలంలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయవచ్చు. దీంతో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. వీటిని మీ కోసం తయారు చేయడమే కాకుండా.. మార్కెట్‌లో అమ్మవచ్చు. ఇది మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. కాబట్టి ప్రణాళిక ఏమిటి.. మీరు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు.. మొత్తం ప్రక్రియను తెలుసుకుందా…
ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం…
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుం యోజనను తీసుకొచ్చింది. ఈ పథకంలో రైతులు తమ వ్యవసాయ భూములను ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వడం ద్వారా లేదా వ్యవసాయ క్షేత్రంలో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయంను పొందవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్తును అమ్మడంతో లాభాలను పొందవచ్చు. ఎవరైనా తన భూమిని అద్దెకు ఇస్తే.. దానికి బదులుగా అతను రూ .4 లక్షల వరకు అద్దె పొందవచ్చు. అయితే, ఇందుకోసం కొన్ని షరతులు ఉన్నాయి.
ప్రణాళిక యొక్క ప్రయోజనాలు..
1. ఈ పథకం కింద ఒక వ్యక్తి తన భూమిలో మూడింట ఒక వంతు సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి అద్దెకు తీసుకోవచ్చు. దీనికి ప్రతిగా కంపెనీలు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున అద్దె వస్తుంది. సాధారణంగా ఈ ఛార్జీ 1 నుండి 4 లక్షల మధ్య ఉంటుంది.
2. ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలంటే ముందుకు దరఖాస్తుదారుడు ఏదైన సంస్థతో ఒప్పందం చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఒప్పందం సాధారణంగా 25 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. కాంట్రాక్ట్ వ్యవధి పూర్తయిన తర్వాత మాత్రమే అద్దె పెరుగుతుంది.
3. సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి మొత్తం ఖర్చును ప్రైవేటు సంస్థ భరిస్తుంది. ఇందుకోసం మనం డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. అదే సమయంలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పెద్ద డిస్కౌంట్లు కూడా ఇస్తుంది.
4. మీరు ఎకరం భూమిని ఇస్తే రైతులకు 1000 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. అలాగే, అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తే, వారు దానిని కంపెనీకి లేదా ప్రభుత్వానికి కూడా అమ్మవచ్చు.
విద్యుత్తు ఎలా..ఎక్కడ అమ్మడం..
సౌర ఫలకాలను అద్దెకు ఇవ్వడమే కాకుండా దరఖాస్తుదారులు విద్యుత్తును అమ్మడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. పీఎం కుసుమ్ యోజన కోసం ముందుగా నమోదు చేసుకోవాలి. విద్యుత్ అమ్మడానికి ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలను సంప్రదించండి. ఒక మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఆరు ఎకరాల భూమి అవసరం ఉంటుంది. దీనితో 13 లక్షల యూనిట్ల విద్యుత్తును తయారు చేయవచ్చు. ఇలా వ్యవసాయదారుడు ఆర్ధికంగా ఎదిగేందుకు ఉపయోపడుతుంది.