సోని కేసులో ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టు ఊరట.. ఘజియాబాద్ పోలీసులకు షాక్

యూపీ లోని ఘజియాబాద్ లో అబ్దుల్ సమద్ సోని కేసుకు సంబంధించి తనకు పోలీసులు పంపిన సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టు నుంచి ఊరట లభించింది.

సోని కేసులో ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టు ఊరట.. ఘజియాబాద్ పోలీసులకు షాక్
Big Relief To Twitter India
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 23, 2021 | 5:25 PM

యూపీ లోని ఘజియాబాద్ లో అబ్దుల్ సమద్ సోని కేసుకు సంబంధించి తనకు పోలీసులు పంపిన సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఆయన వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని పోలీసులు ఈ సమన్లలో కోరగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని, పర్సనల్ గా హాజరయ్యే ప్రసక్తే లేదని మనీష్..వాటిని సవాలు చేశారు. ఈ కేసులో కోర్టు శుక్రవారం రూలింగ్ ఇస్తూ.. మనీష్ యూపీకి వెళ్ళవలసిన అవసరం లేదని, ఆయనను అసలు నిందితునిగా కాకుండా సాక్షిగా మాత్రమే విచారించాలని పోలీసులకు సూచించింది. మనీష్ తన ట్వీట్స్ ద్వారా రెండు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, క్రిమినల్ కుట్రకు పాల్పడ్డారని ఖాకీలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు దురుద్దేశపూరితంగా ఉన్నాయని, వేధింపులకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని, కేసును కావాలనే తప్పుదారి పట్టించేట్టు వారు యత్నిస్తున్నారని కోర్టు పేర్కొంది.

తమ విచారణకు హాజరు కావాలంటూ ఘజియాబాద్ పోలీసులు గత జూన్ 23 న మనీష్ మహేశ్వరికి సమన్లు పంపారు. అంతకు ముందే ఒకసారి వారు జారీ చేసిన సమన్లను ఆయన అప్పుడే కోర్టులో సవాల్ చేశారు. అప్పుడు ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. దాంతో ఘజియాబాద్ ఖాకీలు పట్టు విడవకుండా మళ్ళీ నోటీసులను పంపారు. కానీ కోర్టు వీటిని సీరియస్ గా పరిగణించింది. యూపీలో అబ్దుల్ సమద్ అనే ముస్లిం వృద్దునిపై సుమారు ఒకటిన్నర నెల క్రితం జరిగిన దాడి కేసుకు సంబంధించి మనీష్ పైన, కొందరు కాంగ్రెస్ నేతలపైనా పోలీసులు కేసు పెట్టారు. జైశ్రీరామ్, వందేమాతరం అని నినాదాలు చేయాల్సిందిగా ఆ వృద్దుడిని బలవంత పెట్టిన ఘటన తాలూకు వీడియో అప్ప్పట్లో వైరల్ అయింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని ట్వీట్లను తొలగించాలని పోలీసులు మనీష్ ను కోరినా ఆయన నిరాకరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Olympics 2021 Opening Ceremony Live: ఒలింపిక్ వేడుకకు రంగం సిద్ధం..!

IND vs SL 3rd ODI : శ్రీలంక, భారత్ మూడే వన్డేకు వర్షం అంతరాయం.. ఆటను నిలిపివేసిన అంపైర్లు..