పంజాబ్ లో బీజేపీ నేత పొలాన్ని నాశనం చేసిన రైతులు.. ట్రాక్టర్ తో ‘దున్నేసిన అన్నదాతలు’.. నిరసనలో మహిళలు సైతం

పంజాబ్ లో ఓ బీజేపీ నేతకు చెందిన పొలాన్ని రైతులు నాశనం చేశారు. వివాదాస్పద రైతు చట్టాలు మూడింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వీరు ఇలా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

పంజాబ్ లో బీజేపీ నేత పొలాన్ని నాశనం చేసిన రైతులు.. ట్రాక్టర్ తో 'దున్నేసిన అన్నదాతలు'.. నిరసనలో మహిళలు సైతం
Destroy Bjp Leaders Land In
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 03, 2021 | 2:57 PM

పంజాబ్ లో ఓ బీజేపీ నేతకు చెందిన పొలాన్ని రైతులు నాశనం చేశారు. వివాదాస్పద రైతు చట్టాలు మూడింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వీరు ఇలా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బర్నాలా జిల్లాలో ధనౌలీ గ్రామంలోని హర్జిత్ సింగ్ గ్రెవాల్ అనే బీజేపీ నేతకు చెందిన పొలంలోకి ప్రవేశించిన వీరు అక్కడి వరి నాట్లను పెరికి వేశారు.. కొంతమంది మహిళలు కూడా ఈ ఆగ్రహ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 1. 5 ఎకరాల భూమిని అన్నదాతలు ట్రాక్టర్ తో దున్నేసి తమ కసి తీర్చుకున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వీరంతా ఒక్కసారిగా ఈ వెరైటీ ‘దాడికి’ దిగారు. రైతులపై హర్జిత్ సింగ్ గ్రెవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. అందువల్లే తామీ పని చేశామని ఈ సంఘం కన్వీనర్ బల్వంత్ సింగ్ ఉప్పాలి తెలిపారు. అన్నదాతల ఆందోళన కొనసాగాలనే రైతు సంఘాలు భావిస్తున్నాయని, వీరికి గ్రామాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా నిధులు అందుతున్నాయని హర్జిత్ సింగ్ ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తానక్కడే ఉన్నానని బల్వంత్ సింగ్ తెలిపారు.

హర్జిత్ సింగ్ కి చెందిన వ్యవసాయక్షేత్రంలో వ్యవసాయ కార్యకలాపాలను ఎవరూ కాంట్రాక్టుకు తీసుకోరాదని సంయుక్త కిసాన్ మోర్చా ఆ మధ్య హెచ్చరిక కూడా జారీ చేసిందని ఆయన చెప్పారు. అటు-ఈ ఘటనపై హర్జిత్ సింగ్ పంజాబ్ డీజీపీకి, హోం మంత్రి అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేశారు. ధనౌలా పోలీసు స్టేషన్ లో ఈ రైతులపై ఎఫ్ఐఆర్ దాఖలయినప్పటికీ ఎవరిమీదా చర్య తీసుకోలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: Road accident On Camera: కుటుంబాన్ని వెంటాడిన మృత్యువు.. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డు ప్రమాదం..

Viral News: కట్నంగా స్విఫ్ట్​ కారును ఇవ్వలేదని ఓ వరుడు ఊహించని పని చేశాడు..