Bharat Bandh: విజయవంతంగా ముగిసిన రైతుల భారత్‌బంద్.. ఆందోళన సమయంలో గుండెపోటుతో రైతు మృతి!

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  రైతులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు (సెప్టెంబర్ 27) న నిర్వహిస్తున్న భారత్‌బంద్ ముగిసింది.  ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన బంద్ సందర్భంగా అనేక జాతీయ, రాష్ట్ర రహదారులు మూత పడ్డాయి.

Bharat Bandh: విజయవంతంగా ముగిసిన రైతుల భారత్‌బంద్.. ఆందోళన సమయంలో గుండెపోటుతో రైతు మృతి!
Bharat Bandh

Bharat Bandh: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  రైతులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు (సెప్టెంబర్ 27) న నిర్వహిస్తున్న భారత్‌బంద్ ముగిసింది.  ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన బంద్ సందర్భంగా అనేక జాతీయ, రాష్ట్ర రహదారులు మూత పడ్డాయి. అనేక మార్గాలలో ట్రాఫిక్ ను మళ్లించాల్సి వచ్చింది. బంద్ ప్రభావం రైళ్ళపై కూడా పడింది. ఢిల్లీ నుంచి బయలుదేరే అనేక రైళ్లు రద్దు చేశారు.  హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దు కూడా 10 గంటలపాటు మూసి వేశారు. కొద్దిసేపటి క్రితం దీనిని తెరిచారు. 

ఆందోళనలో రైతు మృతి!

భారతీయ బంద్ పూర్తిగా విజయవంతమైందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికైత్ అన్నారు. ఇప్పుడు యునైటెడ్ కిసాన్ మోర్చా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా  ప్రదర్శన సమయంలో ఢిల్లీ-సింఘు సరిహద్దులో ఒక రైతు మరణించాడు. అతను గుండెపోటుతో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. మరణించిన రైతును భాగెల్ రామ్‌గా గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసు అధికారి తెలిపారు.

కాంగ్రెస్, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ , వామపక్షాలు, వైసీపీ  భారత్ బంద్‌కు మద్దతు ఇచ్చాయి. బంద్‌కు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) నుండి మద్దతు లభించింది. అదే సమయంలో, రైతులు ఆందోళనను విరమించి, చర్చల మార్గాన్ని అవలంబించాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

పోలీసు బారికేడింగ్‌ని బద్దలు కొట్టిన రైతులు..

పెద్ద సంఖ్యలో రైతులు నోయిడా అథారిటీ సమీపంలో గుమిగూడి పోలీసు బారికేడింగ్‌ను బద్దలుకొట్టారు. దీని తరువాత వారు  నోయిడా అథారిటీ వైపు దూసుకుపోయారు.

బంద్ విజయవంతం..అశోక్ ధావలె 

గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ భారత్ బంద్‌కు ఇంత మద్దతు లభించలేదని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. 25 కి పైగా రాష్ట్రాలలో బంద్ విజయవంతమైందని అయన వెల్లడించారు.  రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్యుపష్టం చేశారు. 

కాగా, పంజాబ్‌లో భారత్ బంద్ పూర్తిస్థాయిలో విజయవంతం అయింది.  పంజాబ్‌లోని లూథియానాలోని లాడోవల్ టోల్ ప్లాజా మరియు MBD మాల్ ఫిరోజ్‌పూర్ రోడ్ వద్ద నిరంతరం సిట్-ఇన్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ రోడ్డు మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు,  విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటి నుండి పనిచేశారు. చాలా పాఠశాలలు పరీక్షలను వాయిదా వేశాయి. రైతులకు మద్దతుగా టాక్సీ సేవ కూడా నిలిచిపోయింది.  బస్టాండ్లు,పెట్రోల్ పంపులు కూడా మూతపడ్డాయి.

Also Read: Building Collapsed: హమ్మయ్య.. అంతా సేఫ్.. ఇలా బయటకు వచ్చారో లేదో కూలింది..

SRH vs RR IPL 2021 Records: పోటీలో ఇరు జట్లు సమమే.. నేడు హోరాహోరీ పోరు గ్యారెంటీ.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu