Farmer Protest: మరోసారి కదం తొక్కిన అన్నదాతలు.. నేటి నుంచి జంతర్ మంతర్ వేదికగా ఆందోళన..!
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ప్రశాంతంగా ఆందోళన సాగిస్తున్న రైతన్నలు మరోసారి కదం తొక్కారు.
Farmers hold Kisaan Parliament in Delhi: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అన్నదాతల నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ప్రశాంతంగా ఆందోళన సాగిస్తున్న రైతన్నలు మరోసారి కదం తొక్కారు. ఢిల్లీ నడిబొడ్డున జంతర్‌మంతర్ వద్ద నేటి నుంచి ఆందోళన చేపట్టనున్నారు. ‘కిసాన్ సంసద్ పేరుతో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమానికి సరిహద్దుల నుంచి అన్నదాతలు బస్సుల్లో ర్యాలీగా వచ్చారు
జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ నిర్వహించుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిన్న అనుమతినిచ్చింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో రైతులు సరిహద్దుల నుంచి ర్యాలీగా వెళుతున్నారు. ఇప్పటికే సింఘు సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున రైతులు గుమిగూడారు. పోలీసు ఎస్కార్ట్ మధ్య 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నారు.
అయితే, ఈ జంతర్‌మంత్ పార్లమెంట్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు సరిహద్దుల్లోనూ భద్రతను పెంచారు. టిక్రి సరిహద్దుల్లో ఆందోళనకు అనుమతినివ్వకపోవడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
Read Also… కొంపముంచిన అత్యాశ.. ఇన్సూరెన్స్ కోసం సొంత బెంజ్ కారునేని తగులబెట్టి.. చివరికి..!