ఇలాంటి వాటిని ప్రచారం చేయడం ఆపండి: ధోని భార్య ఫైర్‌

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు అటు దేశ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి పలువురు ప్రముఖుల నుంచి ఆర్థిక మద్దతు లభిస్తోంది.

  • Tv9 Telugu
  • Publish Date - 3:50 pm, Sat, 28 March 20
ఇలాంటి వాటిని ప్రచారం చేయడం ఆపండి: ధోని భార్య ఫైర్‌

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు అటు దేశ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి పలువురు ప్రముఖుల నుంచి ఆర్థిక మద్దతు లభిస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఓ ఎన్జీవోకు రూ.1లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ధోనిపై కొంతమంది విమర్శలు కురిపించారు. ఎంతో ధనవంతుడైన ధోని చాలా పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారంటూ కొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలో వాటిపై ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో స్పందించారు.

సున్నితమైన విషయాల్లో ఇలాంటి అబద్దపు వార్తలను ప్రచారం చేయడం ఆపండి అని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నా. మిమ్మల్ని చూస్తే షేమ్‌గా ఉంది.  నిజమైన జర్నలిజం విలువలు మాయమైపోయాయా..? అని ఆశ్చర్యంగా ఉంది అని ధోని సాక్షి ట్వీట్ చేశారు. మరి ధోని భార్య క్లారిటీ ఇచ్చిన తరువాతైనా ఇలాంటి వార్తలకు చెక్ పడతాయేమో చూడాలి.

Read This Story Also: ఐదు నిమిషాల్లోనే ‘కరోనా’ పరీక్ష నిర్ధారణ.. కిట్ తయారుచేసిన అమెరికన్ సంస్థ..!