ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు, ఏడుగురి అరెస్ట్

ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్ గుట్టును సైబర్ సెల్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా సభ్యులు 500 మందికి పైగా వ్యక్తులను చీట్ చేసి రూ. 2.5 కోట్లను వెనకేసుకున్నారట. తమను ఫారినర్లుగా..

ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు, ఏడుగురి అరెస్ట్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 12, 2020 | 12:30 PM

ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్ గుట్టును సైబర్ సెల్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా సభ్యులు 500 మందికి పైగా వ్యక్తులను చీట్ చేసి రూ. 2.5 కోట్లను వెనకేసుకున్నారట. తమను ఫారినర్లుగా చెప్పుకుంటూ ఫేక్ సిమ్ కార్డులను ఉపయోగించి.. వీరు సాగించిన దందా బయట పడింది. ఈ గ్యాంగ్ లోని ఏడుగురిని అరెస్టు చేశామని, వీరిలో ముగ్గురు బీఏ చదువుతున్న విద్యార్థులని పోలీసులు తెలిపారు. పేరు పొందిన కంపెనీల నుంచి తక్కు వ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ ఈ ఘరానా కేటుగాళ్లు అనేకమందిని బుట్టలో వేసుకున్నారని, రుణం కోసం మీరు కొంత మొత్తాన్ని ఫలానా బ్యాంకులో డిపాజిట్ చేయాలని వీరు నేర్పుగా మోసగించారట.. బాధితులు వారు చెప్పిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయగానే ఇక వీరు  తమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమో, సిమ్ కార్డు మార్చడమో చేసి తప్పించుకుంటూ వచ్చారని ఖాకీలు చెప్పారు. రుణం కోసం ఓ వ్యక్తి వీరిని సంప్రదించా డని, అయితే అనుమానం వఛ్చి వారు పేర్కొన్నకంపెనీని కాంటాక్ట్ చేయగా తాము ఆన్ లైన్ ద్వారా గానీ, ఇతరత్రా గానీ ఎలాంటి రుణాలు మంజూరు చేయడంలేదని ఆ సంస్థ తెలిపిందని ఆ వ్యక్తి వెల్లడించాడు. ఈ ముఠా మోసాన్ని ఆయన ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి దర్యాప్తులో ఈ చీటర్ల మోసం బయటపడింది.

ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే
ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే
నితీష్ కుమార్ రెడ్డికి విశాఖలో ఘన స్వాగతం!
నితీష్ కుమార్ రెడ్డికి విశాఖలో ఘన స్వాగతం!
L&T చైర్మన్‌‌కి క్లాస్ పీకిన గుత్తా జ్వాల
L&T చైర్మన్‌‌కి క్లాస్ పీకిన గుత్తా జ్వాల
Video: 5 వికెట్లతో రెచ్చిపోయిన టీమిండియా మిస్టరీ బౌలర్
Video: 5 వికెట్లతో రెచ్చిపోయిన టీమిండియా మిస్టరీ బౌలర్
మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలు
మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలు
భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. నయా థ్రిల్లర్
భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. నయా థ్రిల్లర్
రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్
రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా