BSP: ఏనుగు గుర్తుపై మొదటిసారి గెలిచింది ఎవరో తెలుసా..? బహుజన సమాజ్ ఎన్నికల ప్రస్థానం..

BSP: ఏనుగు గుర్తుపై మొదటిసారి గెలిచింది ఎవరో తెలుసా..? బహుజన సమాజ్ ఎన్నికల ప్రస్థానం..
Bsp

Bahujan Samaj Party: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. దేశం మొత్తం యూపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో యూపీలో అప్పుడు.. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిణామాలపై

Shaik Madarsaheb

|

Feb 14, 2022 | 12:09 PM

Bahujan Samaj Party: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. దేశం మొత్తం యూపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో యూపీలో అప్పుడు.. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిణామాలపై న్యూస్9 ప్రత్యేక కథనం. అయితే.. బీఎస్‌పీ మొదటి ఎన్నికలను ఎలా ఎదుర్కొంది.. కాన్షీరామ్ ఎలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేశారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జలౌన్ జిల్లాలో పార్టీ సిద్ధాంతాన్ని బలోపేతం చేశారు అన్న విషయాలపై సుమిత్ పాండే.. ప్రత్యేకంగా వివరించారు. కాన్షీరామ్ పూణే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, స్వతంత్రానంతర భారతదేశంలో ఉప-ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కొత్త ప్రయోగాన్ని ప్రారంభించడానికి రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. వెనుకబడిన, మైనారిటీ కమ్యూనిటీ ఉద్యోగుల సమాఖ్య, లేదా BAMCEF, ప్రభుత్వ ఉద్యోగులలో బలమైన మద్దతును రూపొందించడానికి బహుజన్ సమాజ్ పార్టీని 1970లో వ్యవస్థాపించారు. ఒక సంవత్సరం తర్వాత.. కాన్షీ రామ్ దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్ష్ సమతి లేదా DS4ని ఏర్పాటు చేయడం ద్వారా మరో అడుగు ముందుకు వేశారు. డిసెంబరు 6, 1984న, డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి రోజున దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్ష్‌ను రాజకీయ శక్తిగా మార్చారు. దానికి బహుజన్ సమాజ్ పార్టీ అని పేరు పెట్టారు.

మూడు సంవత్సరాల తర్వాత 1987లో.. రాష్ట్రంలోని వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జలౌన్ జిల్లాలో జరిగిన మునిసిపాలిటీ ఎన్నికలలో… కాన్షీరామ్ తన రాజకీయ సిద్ధాంతాన్ని పరీక్షించడానికి తన మొదటి అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఒరై స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీకి చెందిన బాబు రామ్ ఎంకామ్‌కి, అక్బర్ అలీకి మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే.. వీపీ సింగ్‌కు చెందిన జనతాదళ్‌తో కలిసి ఉన్న అలీ స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ వెనుకబడిన, దళిత వర్గాల ఓట్లను సంపాదించడంలో అతను విజయం సాధించాడు. దీంతో కాన్షీరామ్ అందరినీ ఆకట్టుకున్నాడు.

కొన్ని నెలల తర్వాత.. BSP నాయకురాలు మాయావతి నియోజకవర్గాన్ని సందర్శించారు. 1989 అసెంబ్లీ ఎన్నికలకు BSP అభ్యర్థిగా అలీని ప్రకటించడానికి ఒక సమావేశంలో ప్రసంగించారు. జలౌన్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో BSP ఒక ముస్లిం అభ్యర్థిని, ఇద్దరు OBC, ఒక దళిత అభ్యర్థిని నిలబెట్టింది. ఎన్నికలను పోలరైజ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. ‘బజరంగ్ బాలి వర్సెస్ అలీ అన్న నినాదంతో ముందుకెళ్లింది. అయితే.. 1989 ఎన్నికల్లో బీఎస్పీ 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.

అయితే.. యూపీలో కాంగ్రెస్‌ చివరి ముఖ్యమంత్రి ఎన్‌డీ తివారీ తన పార్టీని కాపాడుకోలేకపోయారు. జలౌన్‌లోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో బీఎస్పీ మూడింటిని గెలుచుకుంది. నాలుగో స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. స్వాతంత్య్రానంతర భారతదేశ ఎన్నికల చరిత్రలో అక్బర్ అలీ BSP ఎన్నికల గుర్తు – ఏనుగుపై గెలిచిన మొదటి అభ్యర్థిగా నిలిచారు. బీజేపీకి చెందిన బాబురామ్‌ ‘ఎంకామ్‌’పై ఆయన విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థులు గెలుపొందిన ఇతర 11 అసెంబ్లీ స్థానాల కంటే ముందుగా ఓరై ఫలితాలు వెలువడ్డాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా అలీ పనిచేశారు. ఆ తర్వాత ఆయన పార్టీని వీడి, ఎస్పీ, కాంగ్రెస్‌లలో సుదీర్ఘకాలం కొనసాగిన తర్వాత మళ్లీ బీఎస్పీలో చేరారు.

Also Read:

UP Assembly Election 2022 Voting Live: యూపీలో ఉదయం 11 గంటల వరకు 23 శాతం ఓటింగ్.. భారీ స్థాయిలో గోవా ఓటర్ల స్పందన..

PM Narendra Modi: ఆ తర్వాత ఇప్పుడే పంజాబ్‌కు ప్రధాని మోదీ.. ఎన్నికల ర్యాలీలో కీలక ప్రసంగం..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu