PM Narendra Modi: ఆ తర్వాత ఇప్పుడే పంజాబ్‌కు ప్రధాని మోదీ.. ఎన్నికల ర్యాలీలో కీలక ప్రసంగం..

PM Narendra Modi: ఆ తర్వాత ఇప్పుడే పంజాబ్‌కు ప్రధాని మోదీ.. ఎన్నికల ర్యాలీలో కీలక ప్రసంగం..
Pm Narendra Modi

PM Narendra Modi -Punjab polls: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు రోజులే సమయం ఉంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ

Shaik Madarsaheb

|

Feb 14, 2022 | 8:56 AM

PM Narendra Modi -Punjab polls: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు రోజులే సమయం ఉంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) సోమవారం జలంధర్‌లో జరిగే బహిరంగ సభలో సోమవారం ప్రసంగించనున్నారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ (Punjab polls)స్థానాలకు ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. జనవరి 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు వెళుతుండగా.. కొంతమంది నిరసనకారులు అడ్డుకోవడంతో ప్రధాని 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైన ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని భద్రతలో లోపంపై దేశవ్యాప్తంగా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి సైతం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానికే భద్రత లేకపోతే ఎలా అంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విషయంపై నివేదిక సైతం ఇవ్వాలని హోంమత్రిత్వ శాఖ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అనంతరం నేడు ప్రధాని మోదీ పంజాబ్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి భద్రతా లోపం ఏర్పడకుండా ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ ర్యాలీ జరగనుంది. కాగా.. పంజాబ్ రాష్ట్రంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా పూర్తి మెజారిటీని సాధించింది. అంతకుముందు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న SAD-BJP ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గద్దె దించింది.

యూపీలో వర్చువల్ ద్వారా..

ఇదిలాఉంటే.. యూపీ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో పోలింగ్ జరిగే.. కాన్పూర్, దేహత్, జలౌన్‌లోని 10 అసెంబ్లీ స్థానాల ఉమ్మడి ర్యాలీలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రసంగించనున్నారు. కాన్పూర్ దేహత్‌లోని రానియా అక్బర్‌పూర్ అసెంబ్లీ స్థానంలో ప్రధానమంత్రి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి అనూప్ గుప్తా తెలిపారు. కాన్పూర్, కాన్పూర్ రూరల్, రసూలాబాద్, రానియా అక్బర్‌పూర్, సికంద్రా, భోగ్నిపూర్, మధోఘర్, ఒరాయ్, కల్పిలోని బితూర్, బిల్హౌర్, ఘతంపూర్ అసెంబ్లీల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వినడానికి ర్యాలీ గ్రౌండ్‌కు చేరుకుంటారని ఆయన చెప్పారు. అక్బర్‌పూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రసారం చేయనున్నారు.

Also Read:

UP Assembly Election 2022 Voting Live: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. సమరంలో హేమా హేమీలు..

MK Stalin – Jagdeep Dhankhar: సీఎం స్టాలిన్, బెంగాల్ గవర్నర్ మధ్య ట్విట్ వార్.. అసలేమైందంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu