Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ED Officer Arrest: ఓ కేసులో 20లక్షలు డిమాండ్ చేసిన ఈడీ అధికారి.. చివరకు ఏం జరిగిందంటే..

తమిళనాడులో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. తమిళనాడు దిండిగల్ ప్రాంతంలో ఓ డాక్టర్ నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటూ అంకిత్ తివారీ అనే ఈడీ అధికారి పోలీసులకు చిక్కాడు. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసేందుకు అంకిత్‌ లంచం తీసుకున్నట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు.

ED Officer Arrest: ఓ కేసులో 20లక్షలు డిమాండ్ చేసిన ఈడీ అధికారి.. చివరకు ఏం జరిగిందంటే..
Ed Officer Arrest
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 02, 2023 | 8:30 AM

తమిళనాడులో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. తమిళనాడు దిండిగల్ ప్రాంతంలో ఓ డాక్టర్ నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటూ అంకిత్ తివారీ అనే ఈడీ అధికారి పోలీసులకు చిక్కాడు. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసేందుకు అంకిత్‌ లంచం తీసుకున్నట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి మనీలాండరింగ్‌ కేసుల్లో కొందరు డీఎంకే మంత్రులు ఇప్పటికే అరెస్టయ్యారు. మరికొందరు ఈడీ నిఘాలో ఉన్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం సంచలనంగా మారింది. పట్టుబడిన అంకిత్‌ గతంలో ఇంకెవరి దగ్గరైనా ఇలాగే లంచం తీసుకున్నారా అనే కోణంలో తమిళనాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంకిత్‌ అరెస్ట్‌ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే అంకిత్‌ను ఈ కేసులో ఇరికించారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు అంకిత్‌ తివారి నిర్వాకంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కూడా కన్నెర్ర చేసినట్లు తెలిసింది. విచారణ జరిపి అంకిత్‌పై చర్యలు తీసుకోవాలని ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి తమిళనాడు ఈడీ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.

తమిళనాడు మంత్రులపై కొరడా ఝులిపిస్తున్న వేళ స్వయంగా ఈడీ అధికారి ఒకరు పట్టుబడటం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..