Mizoram Elections: మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్ ఎప్పుడంటే..?
Mizoram Election Counting: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగిన మిజోరంలో కౌంటింగ్ డేట్ మారింది. మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మూడో తేదీనే వెల్లడికానుండగా మిజోరంలో మాత్రం నాలుగో తేదీ కౌంటింగ్ జరగనుంది. మిజోరం ప్రజలు ఆదివారం ధార్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు.
Mizoram Election Counting: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగిన మిజోరంలో కౌంటింగ్ డేట్ మారింది. మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మూడో తేదీనే వెల్లడికానుండగా మిజోరంలో మాత్రం నాలుగో తేదీ కౌంటింగ్ జరగనుంది. మిజోరం ప్రజలు ఆదివారం ధార్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. దీంతో మూడున కాకుండా నాలుగున కౌంటింగ్ జరపాలని మిజోరంలోని వివిధ సంస్థలు ఈసీని కోరాయి. వీరి వినతిని అంగీకరిస్తూ నాలుగో తేదీన కౌంటింగ్ చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. 40 మంది ఎమ్మెల్యేలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. 174 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అధికారం చేపట్టాలంటే కనీసం 21 స్థానాలు సాధించాలి. ఏ పార్టీకీ సొంతంగా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేనందున హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది.
40 మంది సభ్యులున్న మిజోరాం సభకు తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు 80% కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొత్తం 40 స్థానాల్లో మూడు పార్టీలు పోటీ చేశాయి. ఎన్నికల్లో బీజేపీ 23, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేశాయి. స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 27 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..