నా జాగా.. ఎందుకు కబ్జా చేశారు..? ఆగ్రహించిన గజరాజు వాహనాన్ని రెండు పల్టీలు కొట్టించింది.. పాపం డ్రైవర్..?
ఈ వీడియోను ఐఏఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అద్భుతమైన క్యాప్షన్ రాశారు. ‘‘నా ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నారు’’
భారతదేశంలో జనాభా పెరుగుదల కారణంగా ప్రజలు అడవిని ధ్వంసం చేసి ఇళ్లను నిర్మించడం ప్రారంభించారు. దాంతో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. కొన్నిసార్లు అడవుల్ని దాటి వచ్చిన జంతువులు సమీపంలో నివసించే వ్యక్తులపై దాడి చేస్తున్నాయి. మనిషి తన ప్రయోజనం కోసం అనేక విషయాలను అభివృద్ధి చేస్తున్నాడు. కానీ నాశనం అయినప్పుడు చింతిస్తుంటాడు. అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు షాక్ అవుతారు. ఓ డ్రైవర్ టెంపో కారుతో రోడ్డుపై సరుకులు తీసుకెళ్తుండగా ఏనుగు దాడి చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో దూరంగా కొందరు వాహనదారులు రోడ్డుపై వాహనాలను పార్క్ చేసి, ఏనుగు బయలుదేరే వరకు వేచి ఉన్నారు. అయితే, కానీ, ఓ వ్యక్తి మాత్రం అతితెలివిని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. కానీ అది సక్సెస్ కాలేదు. అతను రోడ్డుపై ఏనుగు సమీపం గుండా వెళ్లాలనుకున్నాడు. దాంతో ఆ ఏనుగుకు చిర్రెత్తిపోయింది. విసుగెత్తి పోయిన గజరాజు ఏ మాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే దాడి చేసింది. డ్రైవర్ చాకచక్యం ఏనుగు ముందుకు పనిచేయలేదు. క్షణాల వ్యవధిలో ఏనుగు వాహనాన్ని రెండు సార్లు బోల్తా కొట్టించింది. డ్రైవర్ పరిస్థితి తెలియరాలేదు. అయితే, అతనికి తీవ్ర గాయాలైనట్లు భావిస్తున్నారు.
तुमने मेरे इलाके में #घर क्यों बनाया ????#Narengi #Guwahati today.??@susantananda3 @ParveenKaswan @ipsvijrk @SudhaRamenIFS @moefcc pic.twitter.com/puaHBG5mQM
— Rupin Sharma IPS (@rupin1992) January 14, 2023
ఈ వీడియోను ఐఏఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అద్భుతమైన క్యాప్షన్ రాశారు. ‘‘నా ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నారు’’ అని రాశారు. ఈ ఘటన గౌహతిలోని నారంగిలో చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షకు పైగా వీక్షించారు. చాలా మంది దీనిపై తమ అభిప్రాయాన్ని కూడా తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..