శరద్ పవార్ తో లంచ్……షారుఖ్ ఖాన్ తో డిన్నర్……ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ న్యూ స్ట్రాటజీ !
బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తన పొలిటికల్ టీమ్ ద్వారా ఆయా పార్టీలకు విజయం సాధించి పెట్టిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ముంబైలో ఎన్సీపీ నేత శరద్ పవార్ తో లంచ్ కి హాజరయ్యారు.
బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తన పొలిటికల్ టీమ్ ద్వారా ఆయా పార్టీలకు విజయం సాధించి పెట్టిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ముంబైలో ఎన్సీపీ నేత శరద్ పవార్ తో లంచ్ కి హాజరయ్యారు. 2024 లో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికల్లో తన ‘మిషన్-2024’ కోసం ఆయన ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారనడానికి ఇదే నిదర్శనమని భావిస్తున్నారు. పవార్, కిషోర్ మధ్య సుమారు 4 గంటలపాటు జరిగిన చర్చల్లో ఇదే ప్రధాన అజెండాగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో ప్రధాని మోదీపై ఉమ్మడిగా విపక్ష అభ్యర్థిని ఎవరిని పెట్టాలన్న అంశం గురించి వీరు చర్చించినట్టు సమాచారం. అయితే తాను ప్రతి రాజకీయ నేతనూ కలుస్తానని…వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని, ఇందులో తప్పు లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కాగా-బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో ఆయన డిన్నర్ కూడా చేశారు. షారుఖ్ నివాసం ‘మన్నార్’ లో ఈ విందు జరిగింది. తమ నేత మర్యాదపూర్వకంగా షారుఖ్ ని కలిశారని, ఇందులో పొలిటికల్ కలర్ కి ఆస్కారం లేదని ప్రశాంత్ కిషోర్ సన్నిహితవర్గాలు తెలిపాయి. మూడేళ్ళుగా వీరి మధ్య స్నేహం ఉందని పేర్కొన్నాయి. నాడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…కిషోర్ ని షారుఖ్ కి పరిచయం చేశారట…అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ కలుసుకుంటూ ఉంటారని ఈ వర్గాలు చెప్పాయి. ప్రశాంత్ కిషోర్ జీవితంపై షారుఖ్ ప్రొడక్షన్ హౌస్ చిత్రం తీయవచ్చునన్న ఊహాగానాలను ఇవి కొట్టిపారేశాయి. బెంగాల్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రశాంత్ కిషోర్ తను కొంతకాలంపాటు ట్విటర్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా అని తెలిపారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ తో విభేదాల అనంతరం.. మళ్ళీ ఆ రాష్ట్ర రాజకీయాలకు చేరువ అవుతారా .అన్న ప్రశ్నకు అయన…. తాను విఫల రాజకీయ వేత్తనని చమత్కరించారు. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకుంటానన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Tamil Nadu : లోదుస్తుల్లో 45 మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డ హిజ్రాలు..చూసి షాక్ అయినా పోలీసులు .
Flash Point : కరోనా వైరస్ కి బ్లాక్ ఫంగస్ కి లింకేంటి? విస్తుపోయే నిజాలు వెల్లడించిన టీవీ9.