Odisha CM Convoy: ఒడిషాలో బీజేవైఎం ఆందోళనలు ఉధృతం.. సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్గుడ్ల దాడి జరిగింది. పూరీలో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు.
Attack on Odisha CM Convoy: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్గుడ్ల దాడి జరిగింది. బుధవారం పూరీలో రూ.331 కోట్ల శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. పూరీ నుంచిభువనేశ్వర్కు తిరిగి వెళ్తుండగా దర్జీపోఖారీ ఛక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది అప్రమత్తంతో ప్రమాదం తప్పింది.
కలహండి ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలిని కిడ్నాప్‌చేసిన దుండగులు ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూరీలో నిరసన చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలు.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని వెళ్లి అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. కాగా సీఎం కారుపై దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
సీఎం కాన్యాయ్‌పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య ప్రకటించుకున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తప్పదని ఆయన హెచ్చరించారు. కలహండి ఉపాధ్యాయురాలు కిడ్నాప్, హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్‌ను రాష్ట్ర కేబినెట్ నుంచి వెంటనే తొలగించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాగా,కలహండి ఉపాధ్యాయురాలు కిడ్నాప్, హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి డీఎస్ మిశ్రాను తొలగించాలని కొన్ని వారాలుగా ప్రతిపక్షాలు డిమాండ్చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా టీచర్ మమతా మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్ మిశ్రా సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే బుధవారం బీజేవైఎం కార్యకర్తలు పూరీలో ప్రభుత్వం తీరుకు నిరసనగా కొందరు ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. జగన్నాథ ఆలయం ముందు ఉన్న గ్రాండ్ రోడ్‌పై పేడనీటిని చల్లి శుద్ధి చేశారు. అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ‘కళంకిత రాష్ట్ర మంత్రులు’ పవిత్ర మార్గాన్ని అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు.
Read Also… Hyderabad Road Accident: ఇద్దరు విద్యార్థులను మింగేసిన బోర్‌వెల్ లారీ.. మరొకరి పరిస్థితి విషమం..!